“ఒక మనసు” చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన మెగా డాటర్ నిహారిక, ఆ సినిమాలో చక్కగా చీరకట్టులో హోమ్లీగా కనిపించిన విషయం తెలిసిందే. ఆ సినిమా హిట్ కాకపోయినప్పటికీ, నిహారిక లుక్స్ కు మంచి మార్కులే పడ్డాయి. అయితే రెండవ సినిమాలో అందుకు విరుద్ధంగా పూర్తి విలక్షణతను ప్రదర్శించడం విశేషం.
“హ్యాపీ వెడ్డింగ్” అంటూ సుమంత్ అశ్విన్ సరసన నటించిన సినిమా ట్రైలర్ విడుదల చేయగా, ఇందులో నిహారిక మోడ్రన్ కాస్ట్యూమ్స్ లో తళుక్కుమంది. గ్లామరస్ క్యారెక్టర్ కాదు గానీ, నవతరం అమ్మాయి మాదిరి అల్ట్రా లుక్ లో కనిపించి అలరించింది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా కనపడుతోన్న ఈ సినిమా జూలైలో విడుదల కానుంది.
ADVERTISEMENT
ADVERTISEMENT



