మెగా వారసురాలిగా టాలీవుడ్ లో పరిచయం నిహారిక రెండవ సినిమా “హ్యాపీ వెడ్డింగ్” మొదటి టీజర్ ప్రేక్షకులను పలకరించింది. సుమంత్ అశ్విన్, నిహారికలు జంటగా నటించిన ఈ సినిమా మొత్తం పెళ్లి పైనే రూపుదిద్దుకుందన్న సంకేతాలను ఈ టీజర్ ఇచ్చింది. హీరో హీరోయిన్లకు పెళ్లి సెట్ చేస్తూ వాళ్ళ తండ్రులు చెప్పిన డైలాగ్ తో ఈ టీజర్ ముగుస్తుంది.
ADVERTISEMENT
కేవలం 24 సెకన్లు మాత్రమే ఉన్న ఈ టీజర్ కు కొనసాగింపుగా ట్రైలర్ ను విడుదల చేయనున్నామని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. బహుశా ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై మరింత స్పష్టత వస్తుందేమో. జూన్ 30వ తేదీన ఉదయం 10.36 నిముషాలకు ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ఈ సినిమాను యువీ ప్రొడక్షన్ సంస్థ నిర్మించింది.
ADVERTISEMENT



