హరీష్ ‘సైనికుడైతే’ మరి ‘మంత్రి’.?

harish-rao-bjp-row_-ktr-defends-targets-revanth-reddy

హరీష్ రావు బీజేపీ పార్టీలో చేరేందుకు ఆ పార్టీ నేతలతో మంతనాలు సాగిస్తున్నారు అని రేవంత్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి.

తన ఈ వ్యాఖ్యలు వాస్తవం కాదని భద్రాద్రి రాముని సాక్షిగా హరీష్ ప్రమాణం చెయ్యగలరా అంటూ రేవంత్ చేసిన సవాల్ కి కూడా హరీష్, బిఆర్ఎస్ ల నుంచి అంతే ప్రతిస్పందన ఎదురవుతుంది.

ADVERTISEMENT

దేవుళ్ళ మీద ఓట్లు పెట్టి మాట తప్పడం, హామీలు అమలు చేయకపోవడం సీఎం రేవంత్ రెడ్డికి అలవాటే అంటూ మండిపడ్డారు హరీష్. భద్రాద్రి రాముని సాక్షిగా రేవంత్ ఇచ్చిన సంపూర్ణ రుణమాఫీ సంగతేంటని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఉన్న రాజకీయ ద్వేషంతో రైతుల భవిష్యత్ ని బలిపీఠం ఎక్కిస్తున్నారంటూ రేవంత్ టార్గెట్ గా హరీష్ విమర్శలు సంధించారు.

ఇక బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ సైతం రేవంత్ ఖమ్మం సభ ప్రటనల పై స్పందించారు. హరీష్ రావు బీజేపీ లో చేరుతున్నారంటూ గత కొన్నేళ్లుగా ప్రచారం చేస్తూనే వస్తున్నారు. ఇటువంటి ప్రచారాలను హరీష్ ఎప్పటికప్పుడు తిప్పుకుడుతున్నా ఇంకా ఇటువంటి అసత్య ప్రచారాలకే ప్రత్యర్థి రాజకీయ పార్టీలు మొగ్గుచూపుతున్నాయని,

ఇటువంటి వారి విమర్శల ను పట్టుకుని హరీష్ శీల పరీక్షకు సిద్దమవ్వాల్సిన అవసరం లేదని, నాలుగు పార్టీలు మారి, ఢిల్లీకి వెళ్తే పొద్దున్న కాంగ్రెస్, రాత్రికి బీజేపీ తో మంతనాలు చేసే రేవంత్ రెడ్డి వంటి వారికి ఈ శీల పరీక్ష అవసరమంటూ రేవంత్ ని ఎద్దేవా చేసారు కేటీఆర్.

అలాగే కేసీఆర్ తయారుచేసిన సైనికుడు హరీష్ అంటూ సగర్వంగా హరీష్ ని సైనికుడితో పోల్చారు కేటీఆర్. అంటే కేటీఆర్ దృష్టిలో హరీష్, కేసీఆర్ కి రక్షణ కవచం కావచ్చు. అయితే కేసీఆర్ రాజు అనుకుంటే హరీష్ సైనికుడైతే మరి మంత్రి ఎవరవుతారు.?

కేసీఆర్ తెరాస నుంచి బిఆర్ఎస్ వరకు కేసీఆర్ తో కలిసి రాజకీయ అడుగులేసిన హరీష్ నాటి నుంచి నేటి వరకు కేసీఆర్ కి సైనికుడు మాత్రమేనా.? రాజు కి సైనికుడికి మధ్య ఉండే ఆ మంత్రి కేటీఆర్ అవుతారా.?

మరి ఇన్నాళ్లు పార్టీ అధినేత (రాజు) కేసీఆర్ కి కాపు కాసిన హరీష్ రేపటి రోజున బిఆర్ఎస్ పార్టీకి రాజు కాబోయే కేటీఆర్ కి కూడా సైనికుడి మాదిరే కవచం లా నిలబడతారా.? లేదా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నట్టుగా కేసీఆర్ కి కట్టప్పగా మారతారా.?

ADVERTISEMENT
Latest Stories