ఈ స్టార్ హీరోతో సినిమా చేయాలనుందన్న పవన్ డైరెక్టర్!

Harish shankar Wants TO do Film With Hero Naniప్రస్తుతం టాలీవుడ్ లో వరుస హిట్లు అందుకుంటున్న ఏకైక హీరో ‘నాచురల్ స్టార్’ నాని. తాజాగా దిల్ రాజు నిర్మించిన ‘నేను లోకల్’ ట్రైలర్ ను విడుదల చేసి వీక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఫిబ్రవరిలో విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను వీక్షించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘గబ్బర్ సింగ్’ను తెరకెక్కించిన దర్శకుడు హరీష్ శంకర్, తన అనుభూతులను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

“ఈ ట్రైలర్ చూసిన తర్వాత… తనకు ఒక్కటే అనిపించిందని… ఎప్పుడెప్పుడు నానితో పని చేయాలన్న ఆసక్తి కలుగుతోందని…” అభిప్రాయపడ్డారు. ‘క్లాస్ + మాస్ = నాని’ అన్న రేంజ్ లో అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువయ్యాడు ఈ నాచురల్ స్టార్. మాస్ హీరోయిజాన్ని వెండితెరపై అద్భుతంగా చూపించగల దర్శకులలో హరీష్ శంకర్ ఒకరు. నిజంగానే వీరిద్దరూ జత కలిస్తే… వీళ్ళిద్దరి ఖాతాలో మరో హిట్టు వేసుకోవడం ఖాయం అంటున్నారు సినీ జనాలు.

ADVERTISEMENT

ఒక పక్కన నటుడిగా, మరో పక్కన స్టార్ హీరోగా బాక్సాఫీస్ వద్ద తన రేంజ్ ను పెంచుకుంటున్నాడు నాని. ‘అష్టాచమ్మా’ సినిమాతో ‘మహేష్’ క్యారెక్టర్ తో ప్రారంభించిన నాని కెరీర్ దినదిన ప్రవర్ధమానంగా ఎదిగింది. మధ్యలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా గానీ, ‘భలే భలే మగాడివోయ్’ సినిమా నుండి మళ్ళీ పుంజుకున్న నాని, టాలీవుడ్ లో వరుస సక్సెస్ లకు కేరాఫ్ అడ్రస్ గా మారారు.

ADVERTISEMENT
Latest Stories