పిక్ టాక్ : పాములా పడగ విప్పిన ట్రాఫిక్!

Heavy traffic on Mumbai Pune highwayముంబై – పూణే రహదారిపై కొలువు తీరిన ట్రాఫిక్ పరిస్థితి ఇది. అనకొండను మాదిరి కనిపిస్తున్న ఈ స్వరూపం ఖండాలా సమీపంలో ఏర్పడింది. శనివారం నాడు ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తా కొట్టడంతో కిలోమీటర్ల మేర బారులు తీరిన ట్రాఫిక్ ను చూస్తే అవాక్కవ్వాల్సిందే. ఈ ట్రాఫిక్ ను చూసి అయ్యో అనే పరిస్థితి వీక్షకుల వంతు అవుతుంటే, ఆ సమయంలో ట్రాఫిక్ లో చిక్కుకున్న వారి అనుభూతులు ఏమిటో ఊహించుకోవచ్చు. శనివారం తెల్లవారుజాము నుండి ఆగిపోయిన ఈ ట్రాఫిక్ ను మధాహ్న సమయానికి క్లియర్ అయ్యింది. దీంతో ఆ పద్మవ్యూహంలో చిక్కుకున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

ADVERTISEMENT
Latest Stories