నాన్నకు ప్రేమతోలో కుమారి ఏమైంది?

hebba-patel-not-in-nannaku-prematoయంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తాజాగా నటించిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి కానుకగా విడుదల అయిన ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతూ దూసుకు పోతుంది. ఓవర్సీస్‌లో కూడా ఎన్టీఆర్‌కు మంచి వసూళ్లను ఈ సినిమా రాబడుతోంది. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటించిన విషయం తెల్సిందే. ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌తో పాటు ‘కుమారి 21ఎఫ్‌’ ఫేం హెబ్బా పటేల్‌ కూడా కనిపించబోతున్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. తాను నిర్మించిన కుమారి చిత్రంతో ఫేం తెచ్చుకున్న హెబ్బాకు ఈ చిత్రంలో చిన్న గెస్ట్‌ రోల్‌ను సుకుమార్‌ క్రియేట్‌ చేశాడు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు కూడా చెప్పారు.

‘నాన్నకు ప్రేమతో’ చిత్రం స్పెయిన్‌లో చిత్రీకరణ జరుగుతున్న సమయంలో చిత్ర యూనిట్‌ సభ్యులతో హెబ్బా కూడా ఉంది. అక్కడే దాదాపు వారం రోజు హెబ్బా పటేల్‌ చిత్రీకరణలో పాల్గొంది. ఎన్టీఆర్‌తో కలిసి పలు సీన్స్‌ను కూడా చేసింది. తీరా సినిమా విడుదల తర్వాత చూస్తే చిత్రంలో హెబ్బా మిస్‌ అయ్యింది. ఈ సినిమాలో హెబ్బా ఉంటుందని ఆశించిన ప్రేక్షకులకు షాక్‌ తగిలింది. ఎందుకు హెబ్బా సీన్స్‌ను తొలగించారు అనేది దర్శకుడు చెప్పాల్సింది. సినిమా లెంగ్త్‌ ఎక్కువ అయ్యి, ఆమె పాత్రను తొలగించి ఉండవచ్చు అని కొందరు అంటున్నారు. ఈ విషయంపై పూర్తి క్లారిటీ రావాలి అంటే దర్శకుడు సుకుమార్‌ నోరు విప్పాల్సిందే. ఇక మరో వైపు హెబ్బా పటేల్‌ రాజ్‌ తరుణ్‌తో ఒక సినిమాలో మరియు నిఖిల్‌ సరసన ఒక సినిమాలో హీరోయిన్‌గా నటించబోతుంది.

ADVERTISEMENT
Latest Stories