స్టడీగా రామ్ ‘హలో గురు…’ కలెక్షన్స్!

Hello Guru Prema Kosame box office collections-సక్సెస్ కోసం వేచిచూస్తున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ కు “హలో గురు ప్రేమ కోసమే” ఆ లోటు తీర్చిందా? అంటే ఇప్పుడే చెప్పలేం గానీ, ట్రెండ్ మాత్రం రామ్ కు ఆశాజనకంగా ఉంది. మొదటి రోజు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న రామ్, రెండవ రోజు కలెక్షన్స్ స్టడీగా ఉండడం చిత్ర యూనిట్ కు సంతోషాన్ని పంచె విషయం. సినిమాకు లభించిన టాక్ రీత్యా ఈ వీకెండ్ వరకు కలెక్షన్స్ కు డోకా లేకపోవచ్చు.

ADVERTISEMENT

ఆ తర్వాతే అసలు పరీక్ష మొదలవుతుంది. గొప్పగా చెప్పుకోదగ్గ సినిమా కాకపోయినా, సరదాగా ఓ సారి చూసేయోచ్చన్న టాక్ లభించడంతో ఫ్యామిలీ ప్రేక్షకులకు వినోదాలను అందిస్తోంది. ఏపీ, తెలంగాణాల పరిస్థితి ఇలా ఉంటే, యుఎస్ లో మాత్రం బండి చాలా స్లోగా సాగుతోంది. రామ్ గత చిత్రం ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ కలెక్షన్స్ (313 కే)కు కూడా చేరుకోవడం కష్టసాధ్యంగానే కనపడుతోంది.

ADVERTISEMENT
Latest Stories