పనామా ఎఫెక్ట్… హెరిటేజ్ డైరెక్టర్ పదవి హుష్ కాకి..!

Heritage foods Managing director in panam leaksఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబం నిర్వహిస్తున్న ‘హెరిటేజ్ ఫుడ్స్’ సంస్థలో ఇండిపెండెంట్ డైరెక్టర్ గా ఉన్న మోటపర్తి వెంకట శివరామప్రసాద్ విదేశాల్లో అక్రమంగా నగదు దాచుకున్నట్లు ఇటీవల విడుదలైన పనామా పత్రాల్లో అభియోగాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. దీంతో ‘హెరిటేజ్’ యాజమాన్యం సూచనల మేరకు ఇండిపెండెంట్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.

ADVERTISEMENT

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ (సెబీ) నిబంధనల ప్రకారం ఒక వ్యక్తిని స్వతంత్ర డైరెక్టరుగా నియమించాల్సి ఉండడంతో… పలు దేశాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న మోటపర్తిని ‘హెరిటేజ్’ ఇండిపెండెంట్ డైరెక్టర్ గా చంద్రబాబు ఎంచుకున్నారు. అయితే విదేశాల్లో కంపెనీలు పెట్టిన మోటపర్తి, ఇండియాలో పన్నులు కట్టకుండా అక్కడికి నిధులు తరలించినట్టు ఆరోపణలు రావడం వలన రాజీనామా చేయడం గమనార్హం.

ADVERTISEMENT
Latest Stories