ఇటీవల కాలంలో టాలీవుడ్ లో హాట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న జంట ఏదైనా ఉందంటే… అది సమంత – నాగచైతన్యల జోడి మాత్రమే! టాలీవుడ్ కు తలమానికంగా నిలిచిన ఈ పెయిర్ తరహాలోనే కోలీవుడ్ లో ఓ పెయిర్ పేరు ఇటీవల కాలంలో బాగా హల్చల్ చేస్తోంది. చెన్నై బ్యూటీ అయిన సమంత, త్వరలో అక్కినేని వారింటి కోడలు కాబోతోందని ప్రచారం జరుగుతుంటే… తెలుగు ముద్దుగుమ్మ అంజలి, కోలీవుడ్ కోడలు కాబోతుందన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల జరిగిన అంజలి పుట్టినరోజు నాటి నుండి మరింత ఊపందుకున్న ప్రచారం, తాజాగా మొదలైన హార్రర్ సినిమా సందర్భంగా ‘జై – అంజలి’ ఇచ్చిన స్టిల్స్ మరింత ఊతమిచ్చే విధంగా ఉండడం విశేషం. ఈ ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూస్తుంటే… త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కడం ఖాయం అంటూ కోలీవుడ్ సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. టాలీవుడ్ లో ఈ ఏడాది చివారంతం డిసెంబర్ లో చైతూ – శ్యామ్ ల జోడి ఒక్కటవుతారని ప్రచారం జరుగుతుండగా, అంజలి – జైల విషయంలో ఈ మాత్రం క్లారిటీ కూడా మిస్సవుతోంది.





