ఆంధ్రప్రదేశ్ లోకి ఇతర రాష్ట్రాల మద్యం రావడం ఎక్కువైంది. ఏపీలో మద్యం ధరలు ఎక్కువగా ఉండటం అలాగే ప్రముఖ బ్రాండ్లు ఏమీ దొరక్కపోవడంతో స్ముగ్లింగ్ తో పాటు మద్య ప్రియులు కూడా ఇతర రాష్ట్రాల నుండి మద్యం తెచ్చుకుంటారు. అయితే తమ ఆదాయం తగ్గిపోవడంతో సరిహద్దులలో పోలీసులు నిఘా పెంచి అరెస్టులు చేస్తున్నారు.
అయితే ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారమే ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వారు మూడు ఫుల్ బాటిల్స్ తెచ్చుకోవచ్చని అనుమతి ఇచ్చింది. అయినా పట్టించుకోకుండా కొన్ని సార్లు అరెస్టులు చెయ్యడంతో కొందరు ఈ విషయంపై హైకోర్టుకు వెళ్లారు. ఈ తీర్పు ప్రకారం ఎవరైనా ఇతర రాష్ట్రాల నుంచి మూడు మద్యం బాటిళ్లు తెచ్చుకునే అవకాశాన్ని హైకోర్టు కలిగించింది.
హైకోర్టు తీర్పుతో మద్యం ప్రియులకు ఏపీలో ఉన్న పరిస్థితుల నుంచి ఉపశమనం కలిగినట్లు అయ్యింది. జీవో నెంబర్ 411 ప్రకారం మద్యాన్ని తీసుకుని వచ్చే వెసులుబాటు ఉందని కోర్టు చెప్పింది. అయితే ఈ తీర్పు వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడే అవకాశం ఉంది.
ముఖ్యంగా తెలంగాణతో సరిహద్దు షేర్ చేసుకునే ఆంధ్రప్రదేశ్ జిల్లాలలోని ప్రజలు సరిహద్దు దాటి తెలంగాణలో మద్యం కొనుగోలు చేసుకుని తెచ్చుకునే అవకాశం ఉందంట. ఇది ఇలా ఉండగా.. ప్రభుత్వం ఇచ్చే జీవోలను అమలు చెయ్యాలని కోర్టులు గుర్తు చేస్తే గానీ తెల్వదా? అని కొందరు ఆక్షేపిస్తున్నారు.





