గత కొన్నేళ్లుగా ఎప్పుడూ లేని విధంగా ఈ సంక్రాంతికి 3 రోజుల తేడాలో 4 సినిమాలు విడుదల కానున్నాయి. అయితే ఈ నాలుగు సినిమాలో రెండు సినిమాలు మాత్రం ఖచ్చితంగా “హిట్” అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇంకా విడుదల కాకముందే అంత విశ్వాసం కలిగించిన సినిమాలు ఏవి? దానికి దోహదపడిన అంశాలు ఏవి… అంటే ఆయా సినిమాల నిర్మాణ వ్యయాలను ప్రామాణికంగా తీసుకుని… రెండు చిత్రాలను ఖచ్చితంగా హిట్ బాటలో నిలబెట్టారు ట్రేడ్ పండితులు.
ఇంతకీ ఆ రెండు చిత్రాలు ఏమిటంటే… దాదాపు 7 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన శర్వానంద్ “ఎక్స్ ప్రెస్ రాజా” మరియు దాదాపు 25 కోట్లతో నిర్మితమైన అక్కినేని నాగార్జున “సోగ్గాడే చిన్నినాయనా” చిత్రాలు. ఈ రెండు సినిమాలకు ఎలాంటి టాక్ వచ్చినా సంక్రాంతి సందడి రీత్యా ఆయా సినిమాల బడ్జెట్ ఖచ్చితంగా రికవరీ అవుతుందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ఇక, మిగిలిన రెండు చిత్రాలకు మాత్రం పాజిటివ్ టాక్ వస్తేనే, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు గట్టేక్కే పరిస్థితి నెలకుందని చెబుతున్నారు. నందమూరి బాలకృష్ణ “డిక్టేటర్” దాదాపు 45 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా, జూనియర్ ఎన్టీఆర్ “నాన్నకు ప్రేమతో”కు 50 కోట్ల వరకు ఖర్చయ్యిందని ఫిలింనగర్ వర్గాల టాక్. మరి ఈ స్థాయిలో భారీ వసూళ్ళు సాధించాలంటే… ఈ రెండు సినిమాలకు ‘సూపర్ హిట్’ టాక్ రావాల్సిందే. లేదంటే డిస్ట్రిబ్యూటర్లకు చుక్కలు పట్టపగలే చుక్కలు కనపడతాయని చెప్పడంలో సందేహం లేదు. ఈ కారణం చేతనే ఈ సంక్రాంతి “బాబాయ్ – అబ్బాయ్” ఫైట్ లా మారిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.





