డ్యాన్స్ ల కోసమే సినిమాలు చేయను!

Hrithik Roshan Movie Interview Kaabilఏ సినిమా దర్శకుడైనా కథను సమర్థవంతంగా వినిపించగలిగితే, సినిమా సగం విజయం సాధించినట్లేనని బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అభిప్రాయపడ్డారు. ఇద్దరు అంధుల మధ్య జరిగే అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ‘కాబిల్’ అద్భుతమైన సినిమా అన్నాడు. నిజానికి దర్శకుడు తనకు వద్దకు స్క్రిప్టు లేకుండా వచ్చాడని, అయినా సరే అద్భుతంగా కథ చెప్పాడని కొనియాడారు.

బాలీవుడ్ లో డ్యాన్సింగ్ కింగ్ గా పేరు గాంచిన హృతిక్, తాను కేవలం డాన్సులు చేయడానికి మాత్రమే సినిమాలు చేయనని అన్నారు. ఇమేజ్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉండదని, కొన్ని విషయాల్లో ఇమేజ్ సహాయం చేసినా, కథ విషయంలోకి వచ్చేసరికి ఇమేజ్ ను పట్టుకుని కూర్చుంటే మంచి కథలు చేయలేమని, ఒక నటుడిగా అన్ని రకాల కథలు చేయాలని, తాను అదే పనిలో ఉన్నానని, స్క్రిప్టు డిమాండ్ మేరకు తాను నటిస్తానని, డాన్సులు లేవు, ఫైట్లు లేవు అని అననని, దర్శకుడు ఏం చెబితే అదే చేస్తానని హృతిక్ తెలిపాడు.

ADVERTISEMENT

ఈ సినిమాలో అమితాబ్ సర్ గొంతు నేర్చుకునేందుకు ఆరు రోజులు తీవ్రంగా ప్రయత్నించానని, రెండు రోజుల తరువాత ఆయన గొంతు పలిచే విధానం నేర్చుకోగలిగానని, తరువాత స్నేహితులకు తన గొంతు వినిపించానని, బాగా చేశానని అభినందించారని తెలిపాడు. దీంతో సినిమాలో అమితాబ్ గొంతును విజయవంతంగా అనుకరించానని చెప్పాడు. కేవలం 60 రోజుల్లోనే సినిమా నిర్మించాలని నిర్మాత భావించారని, అది చేసి చూపించారని, ఈ సినిమాతో చాలా విషయాలు నేర్చుకున్నామని హృతిక్ సినిమా సంగతులు చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT
Latest Stories