వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి “చొక్కా మడత పెడతా.. పులివెందులలో ఓటు వేస్తా… ఎవరు అడ్డుకుంటారో అడ్డుకోండి చూస్తానంటూ..” రెండు రోజుల క్రితమే సవాలు విసిరారు. చెప్పినట్లుగానే ఈరోజు ఉదయం బెంగళూరు యలహంక ప్యాలస్ నుంచి హెలికాఫ్టర్‌లో ఉదయం 10.30 గంటలకు పులిచింతల చేరుకున్నారు.
అక్కడి నుంచి తన కాన్వాయ్‌లో పులివెందుల ప్యాలస్‌కు బయలుదేరారు. యధాప్రకారం ఆయన వెంట వందలాది మంది వైసీపీ శ్రేణులు ఫాలో అయ్యారు. తనను టీడీపి శ్రేణులు లేదా పోలీసులు అడ్డుకుంటారని జగన్ ఊహించారు. కానీ అయన ఊహించని విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడుగా పేర్కొనబడి తర్వాత అప్రూవర్‌గా మారిన దస్తగిరి అడ్డుకున్నారు.
దీంతో అక్కడ ఒక్కసారిగా పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ‘మా జీవితాలు నాశనం చేశావు కాదన్నా..” అంటూ దస్తగిరి ఏదో మాట్లాడబోతే వెంటనే డీఎస్పీ బాలస్వామిరెడ్డి, పోలీసులు అతనిని పక్కకు లాగేసి జగన్ కాన్వాయ్‌కి దారి కల్పించారు. ఈరోజు మధ్యాహ్నం జగన్ పులివెందులలో ఓటు వేసేందుకు వస్తారని సమాచారం.
ఆయన వస్తునందున ఈరోజు ఉదయం నుంచే పులివెందులలో భారీగా పోలీసులను మొహరించి భద్రత కట్టుదిట్టం చేశారు. అయితే పోలీసులు వైసీపీ అభ్యర్ధులను, ఏజంట్లను, ఓట్లు వేసేందుకు వచ్చేవారిని అడ్డుకుని వెనక్కు తిప్పి పంపించేస్తున్నారంటూ వైసీపీ సొంత మీడియా, సోషల్ మీడియా ఆరోపిస్తూనే ఉంది.
వివేకా హత్య కేసు విచారణలో చాలా కీలకంగా మారిన దస్తగిరి హటాత్తుగా కళ్ళెదుట ప్రత్యక్షమవడం జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాక్ అనే చెప్పాలి. కానీ పోలీసులు అతనిని పక్కకు లాగేయడంతో జగన్ అతనిని అసలు గమనించినట్లు ముందుకు సాగిపోయారు. ఒకవేళ అతనితో వాగ్వాదానికి దిగి ఉంటే ఏమయ్యేదో?
పులివెందులలో జగన్ కి ఘోర అవమానం…
జగన్ కాన్వాయ్ ని అడ్డుకున్న దస్తగిరి.. నీ బాబాయ్ ని నువ్వే చంపించి, మా జీవితాలు నాశనం చేసావ్ అంటూ, జగన్ ని నిలదీసిన దస్తగిరి..
#Pulivendula #AndhraPradesh #YSJagan #TDP #YSRCP https://t.co/Rrbz1dZs52
— Telugu Stride (@TeluguStride) November 1, 2026





