శృతి హాసన్ బొమ్మ వాడినందుకు బొమ్మ పడింది

Shruti - Haasan
రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా తరాలకు ఉన్న క్రేజ్ తెలిసిందే. దీనితో చాలా మంది తరాల బొమ్మలు తమ షాపులకు వాడేస్తూ ఉంటారు. ఒకప్పుడు అలా ఉంటే సినీ తారలు క్రేజ్ గా ఫీల్ అయ్యేవారు. అయితే ఇప్పుడు మాత్రం దానికి లాయల్టీ అడుగుతున్నారు.హైదరాబాద్ లోని సుల్తాన్ బజారులో ఒక షాప్ యజమాని సినీ హీరోయిన్ శృతి హాసన్ బొమ్మ పెట్టుకున్నాడు. దీనిపై ఎవరు కంప్లయింట్ చేశారో తెలీదు గానీ అధికారులు అతనికి ఫైన్ విధించారు.

అనుమతి లేకుండా శృతి హాసన్ బొమ్మ పెట్టుకున్నదుకు గానూ ఆ షాప్ యజమానికి తెలంగాణ పౌర సరఫరాల శాఖ ఏడు వేల రూపాయిల జరిమానా విధించింది. తెలియక వాడా అని చెప్పినా వినలేదు. ఇది ఇలా ఉండగా కాట‌మ‌రాయుడు త‌ర్వాత తెలుగులో ఈమె మ‌రో సినిమా ఏదీ ఒప్పుకోలేదు. ఒక విదేశీయుడితో ప్రేమలో పడ్డ ఆమె రెండేళ్ల కింద వ‌చ్చిన బెహ‌న్ హోగా తేరీ త‌ర్వాత పూర్తిగా సినిమాల‌కు దూరంగా ఉంది. ఈ మధ్యనే వారికి బ్రేక్ అప్ కావడంతో మళ్ళీ సినిమాల మీద దృష్టి పెట్టింది అమ్మడు.

ADVERTISEMENT

చిరంజీవి, కొర‌టాల శివ సినిమాలో శృతినే హీరోయిన్‌గా తీసుకోవాల‌ని ట్రై చేస్తున్నారు. శ్రీమంతుడు సినిమాలో ఇప్ప‌టికే కొర‌టాల‌తో క‌లిసి ప‌ని చేసింది శృతి. దాంతో మ‌రోసారి సేమ్ కాంబినేష‌న్ రిపీట్ చేయాల‌ని చూస్తున్నాడు ద‌ర్శ‌కుడు కొరటాల‌. ఇక గోపీచంద్ మ‌లినేని, ర‌వితేజ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన బ‌లుపు సినిమాలో న‌టించింది శృతిహాస‌న్. ఇప్పుడు మ‌రోసారి అదే కాంబోలో రాబోయే సినిమా కోసం ఈమెనే తీసుకున్నట్టు సమాచారం. మొత్తానికి బ్రేక‌ప్ త‌ర్వాత శృతిహాస‌న్ వ‌ర‌స సినిమాల‌తో అదరగొడుతుంది.

ADVERTISEMENT
Latest Stories