కమ్ బ్యాక్ స్ట్రాంగ్ ఇండియా..!

India New Zealand Test Series

తాజాగా బంగ్లాదేశ్ తో ముగిసిన రెండు టెస్ట్ ల సిరీస్ ను భారత్ 2 – 0 తో కైవసం చేసుకుని, నేడు మొదలైన ఇండియా vs న్యూజిలాండ్ సిరీస్ లోనికి అడుగు పెట్టారు. అయితే అటు పక్క, న్యూజిలాండ్ జట్టు శ్రీలంక తో జరిగిన సిరీస్ లో వైట్ వాష్ అయ్యి ఈ సిరీస్ కు వచ్చారు. పైగా,హోమ్ టెస్ట్ కాబట్టి భారత్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి.

అయితే ఇన్ని అంచనాల మధ్య నిన్న అక్టోబర్ 16 న మొదలుకావాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా మొదటి రోజు ఆట కోల్పోవల్సివచ్చింది. మరి, రెండవ రోజు టాస్ గెలిచిన భారత్ ఇలాంటి ఓవర్-కాస్ట్ కండిషన్స్ లో తొలుత బ్యాట్టింగ్ ఎంచుకున్నారు. ఆ నిర్ణయం భారత్ కొంప ముంచిందనే చెప్పాలి.

ADVERTISEMENT

కెప్టెన్ రోహిత్, కోహ్లీ తో సహా తొలి 3 వికెట్లు కేవలం 13 పరుగులకే కోల్పోయారు. ఆ పై వచ్చిన రాహుల్, జడేజా, అశ్విన్ లు సైతం ఈ పతనాన్ని ఆపడంలో విఫలమయ్యారు. కొంత మేరకు జైస్వాల్-పంత్ మాత్రం తమ వికెట్ల పతనాన్ని ఆపగలిగారు.ఎవ్వరు ఊహించని విధంగా కేవలం ’46’ పరుగులకే భారత్ ఆల్-అవుట్ అయ్యి సొంత గడ్డ పై అత్యంత స్వల్ప స్కోరును మూటగట్టుకుంది.

మొదటి సెషన్ లో పిచ్ వైఖరి బ్యాటర్లకు అత్యంత భయానకం గా ఉన్నప్పటికీ, రెండవ సెషన్ కే పిచ్ లో కాస్త మార్పులు కనపడ్డాయి. అశ్విన్, పంత్ వంటి బ్యాటర్లు ఆ సమయానికి క్రీజులోనే ఉన్నప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.కేవలం 46 పరుగులకే 10 వికెట్లను సమర్పించుకుని భారత్ కొన్ని చెత్త రికార్డులు కూడా వెనకేసుకుంది.

ఈ ’46’ భారత గడ్డ పై ఒక జట్టు నమోదు చేసిన స్వల్పమైన స్కోరుగా నిలిచింది. వ్యక్తిగతంగా భారత్ నమోదు చేసిన మూడవ చిన్న స్కోరుగా కూడా ఈ స్కోర్ నిలిచింది. ఈ ఇన్నింగ్స్ లో విరాట్, సర్ఫరాజ్, రాహుల్, జడేజా, అశ్విన్ లు తమ ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టారు.

ఇలా,ఒకే ఇన్నింగ్స్ లో భారత్ తరుపున ఇన్ని డక్ ఔట్స్ ఉండటం ఇది 6 వ సారి.ముగిసిన బంగ్లా సిరీస్ లో చెయ్యి జారిపోయింది అనుకున్న మొదటి టెస్ట్ ను కైవసం చేసుకుని, అసలు ఈ మ్యాచ్ కు ఫలితమే రాదు అని ఖరాకండి గా చెప్పేసిన రెండవ టెస్ట్ ను సైతం గెలిచి సిరీస్ ను సొంతం చేసుకున్న భారత జట్టు ఇప్పడు ఇలా ఢీలా పడుతుందని ఎవరు ఊహించలేదు.

ఏదేమైనా భారత జట్టు సత్తా అందరికి తెలుసు కాబట్టి, ఇంకా మ్యాచ్ ముగియలేదు కాబట్టి మ్యాచ్ లో ఇంకా ఎదో అద్భుతం జరగాలని కోరుకుంటున్నారు. అలాగే ఆటలో గెలుపోటములు సహజమే అనుకుంటూ అప్పుడేమో అలా ఇప్పుడేమో ఇలా ”కంబ్యాక్ స్ట్రాంగ్ ఇండియా” అంటూ జట్టుకు అండగా నిలుస్తున్నారు అభిమానులు.

ADVERTISEMENT
Latest Stories