సినిమా హిట్టు హీరో ఫట్టు..!

India’s T20 Success Overshadows Surya, Gill Struggles

ప్రస్తుతం భారత జట్టు వన్-డే మరియు టెస్ట్ ఫార్మాట్ లో ఎలా రాణించినప్పటికీ, టీ-20 ఫార్మటు కు వచ్చే సరికి ఆపొనెంట్ తుక్కు రేగ్గొట్టటమే పనిగా పెట్టుకున్నారని అనుకోవచ్చు. హోమ్ గ్రౌండ్ అయినా, బయటేదైనా, ఫస్ట్ బ్యాటింగ్ ఐనా బౌలింగ్ ఐనా, ఎదురు ఉన్నదీ ఆసీస్ అయినా ఆఫ్ఘన్ అయినా, మనవాళ్ళ ఆటతీరు ఒకేలా ఉంటుంది.

నిన్ననే అహ్మదాబాద్ వేదికగా జరిగిన 5వ టి-20 లో నెగ్గి సౌత్ ఆఫ్రికా సిరీస్ ను కూడా 3-1 తో కైవసం చేసుకుంది భారత్. ఇది వరుసగా భారత్ కు దక్కిన14వ టీ – 20 సిరీస్ విక్టరీ. సొంత గడ్డపై అలుపెరగకుండా 9 సిరీస్ లలో నెగ్గిన భారత్, ఇప్పటిదాకా ఆసీస్ పేరిట ఉన్న రికార్డ్ ను నిన్న వరుసగా 9వ సిరీస్ ను గెలుచుకుని తమ పేరిట రాసుకున్నారు.

ADVERTISEMENT

అయితే, ఇన్ని సిరీస్ విజయాలున్న చోట లోపాలేముంటాయ్ అని అనుకుంటున్నారేమో అందరు. సినిమా బ్లాక్-బస్టర్ అయినప్పటికీ, హీరో పేలవమైన పెర్ఫామెన్స్ ఇచ్చినట్టు.. మనం వరుసపెట్టి సిరీస్ లు అందుకున్నప్పటికీ, మన సారధి సూర్య కుమార్ యాదవ్ మరియు గిల్ మాత్రం తమ పేలవమైన బ్యాట్టింగ్ తో అభిమానులను ఆందోళనలో పడేస్తున్నారు.

2026 వరల్డ్ కప్ కు ఇంకా గట్టిగా 3 నెలలు కూడా లేని యడల, ఈ ఇరువురి ఫామ్ ప్రస్తుతం టి – 20 జట్టులో ఏకైక లూప్ హోల్ లా కనపడుతుంది. టాప్ ఆర్డర్ లో అభిషేక్ మరియు తిలక్ వర్మ కీలకమైన పరుగులు చేస్తున్నప్పటికీ, కెప్టెన్-వైస్ కెప్టెన్ ల నుండి పరుగులు రాకపోవటంతో ప్రతి మ్యాచ్ లో ను మిడిల్ ఆర్డర్ పరీక్షింపబడుతుంది.

జట్టు అందుకున్న అనేక పరీక్షల్లో దూబే, హార్దిక్, సుందర్ మరియు జితేష్ వంటి బ్యాటర్లు సమయానుకూలంగా ముందడుగు వేసి జట్టుకు ఆపద్బాడవుల్లాగా మారిన మ్యాచ్లూ ఉన్నాయి. అభిషేక్ శర్మ ఈ ఏడు టి-20 లలో ఏకంగా 1602 పరుగులు చేసి విరాట్ కోహ్లీ 2016 లో కొట్టిన 1614 పరుగుల రికార్డుకు ఎసరు పెట్టేసాడు.

అభిషేక్ శర్మ ఈ 2025 లో మొత్తం 41 టీ-20 మ్యాచ్లు ఆడగా, 1602 పరుగులను ఏకంగా 202 స్ట్రైక్ రేట్ తో అందుకున్నాడు. ఇక కేవలం ఇంటెర్నేషనల్ మ్యాచ్ల విషయానికి వస్తే, 859 పరుగులను అబ్బురపరిచే 193.5 స్ట్రైక్ రేట్ తో అందుకుని ఎవ్వరు కలలో కూడా ఊహించని రీతిలో టి-20 ఫార్మాట్ ను ఏలుతున్నాడు అభిషేక్ శర్మ.

మరి ఇటు మన కెప్టెన్ సూర్య విషయానికి వస్తే, పరుగులు-స్ట్రైక్ రేట్ సంగతి పక్కనుంచితే గత 20 ఇన్నింగ్స్ లో సూర్య సింగిల్ డిజిట్ స్కోరు తో 12 సార్లు పెవిలియన్ కు తిరిగెళ్లాడు. ఈ ఒక్క స్టాట్ చాలు ప్రస్తుతం సూర్య టి-20ల్లో ఎంత తడపడుతున్నాడో అని చెప్పటానికి.

ఇక సిరీస్ విజయం తరువాత సూర్య పోస్ట్-మ్యాచ్ ప్రెసెంటేషన్ లో సైతం ఈ విషయమై మాట్లాడుతూ ‘ప్రస్తుతం జట్టులో మిస్ అవుతున్న ఏకైక విషయం సూర్య కుమార్-ది బ్యాటర్, అతనిని త్వరలోనే తిరిగి తీసుకొస్తా’ అంటూ తన ఆటతీరును మెరుగు పరుస్తా అనే ధీమాతో వెళ్ళాడు. మరి ఇంత కాలం సూర్య సైలెన్స్, వరల్డ్ కప్ లో స్టార్మ్ గా మారుతుందా..?

ADVERTISEMENT
Latest Stories