లాంగ్ ప్రెస్‌మీట్ తర్వాత కూడా ట్వీట్లు.. ఇదే డిజిటల్ యుగం ఒత్తిడి!

Nani The Paradise Srikanth Odela Reacts to Trolls

నాని కెరీర్‌లోనే అతి పెద్ద సినిమా Paradise. ఆర్థికంగా కూడా ఈ సినిమా టీమ్‌కు చాలా కీలకం. అందుకే ప్రతి చిన్న విషయాన్నీ వాళ్లు సీరియస్‌గా తీసుకుంటున్నారు.

ఈరోజు టీమ్ లాంగ్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఎక్కువసేపు Q&A జరిగింది. సినిమా గురించి మాట్లాడారు. హైప్ పెంచే ప్రయత్నం చేశారు. ప్రేక్షకుల అంచనాలను కూడా సెట్ చేశారు.

ADVERTISEMENT

హైప్ ఇప్పటికే సెట్ అయిపోయిందని, అందుకే ట్రైలర్ కూడా రిలీజ్ చేయబోమని చెప్పారు. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో మిక్స్‌డ్ రియాక్షన్స్ వచ్చాయి.

కానీ ప్రెస్‌మీట్ తర్వాత జరిగినదే ఊహించని విషయం.

దర్శకుడు మాట్లాడిన చిన్న క్లిప్‌ను కట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆయనలో కావాల్సిన కాన్ఫిడెన్స్ కనిపించడం లేదంటూ కొందరు అంచనాలు మొదలుపెట్టారు.

దీనికి వెంటనే దర్శకుడు ఒక GIFతో ట్వీట్ చేశారు.

“My face is like that. See you in theaters on September 24th.”

ఆ ట్వీట్‌ను నాని కూడా కోట్ చేశారు. సినిమా 24న డెలివర్ అవుతుందనే ఇండైరెక్ట్ మెసేజ్ ఇచ్చారు.

నాని, దర్శకుడు ఇద్దరూ Twitterలో వచ్చే చర్చను ఎంత దగ్గరగా ఫాలో అవుతున్నారో ఈ ట్వీట్లు చూపించాయి. ప్రతి కామెంట్‌ను చదవడం, ప్రతి రియాక్షన్‌ను గమనించడం వల్ల ఆ ప్రభావం వాళ్లపై కూడా పడుతోంది.

ఒక సినిమాను హిట్ చేయడం లేదా ఫ్లాప్ చేయడం Twitter చేతిలో ఉండదు. కానీ అక్కడ వచ్చే ప్రతి చిన్న చర్చకూ స్పందిస్తే, అది మరింత పెద్దదవుతుంది.

అంత లాంగ్ ప్రెస్‌మీట్‌లో ఇద్దరూ ప్రత్యక్షంగా కనిపించి, ఎన్నో విషయాలు మాట్లాడిన తర్వాత కూడా ట్వీట్లతో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది.

ఇప్పుడు సినిమాపై కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సింది టీజర్, ట్రైలర్ మాత్రమే కాదు. హీరో, డైరెక్టర్ బాడీ లాంగ్వేజ్, ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ కూడా ముఖ్యమైపోయాయి.

ఒక చిన్న క్లిప్ కొత్త సందేహాన్ని తెస్తోంది. దానికి వెంటనే ఒక ట్వీట్‌తో చెక్ పెట్టాల్సి వస్తోంది.

ఇవే డిజిటల్ యుగం సమస్యలు!

ADVERTISEMENT
Latest Stories