ఒక్క సూపర్ స్టార్ మాత్రమే కాదు… హీరోలందరూ స్పందించాలి..!

Rajinikanth in Trouble for His Fans' 'Palabhishekam'తమ అభిమానాన్ని చూపడంలో సినీ హీరోల అభిమానులు ఎప్పుడూ ముందుంటారు. ముఖ్యంగా ఆయా హీరోల సినిమాల విడుదల సమయంలో ఫ్యాన్స్ అభిమానం పేరుతో చూపించే అత్యుత్సాహం చర్చనీయాంశంగా మారుతోంది. ఇటీవల ‘బాహుబలి, నాన్నకు ప్రేమతో’ సినిమాల విడుదల సమయంలో ధియేటర్ వద్ద మేకపోతును బలిచ్చి విమర్శల పాలయ్యారు. అయితే హీరోల కటౌట్ల మీద పాలాభిషేకం చేయడం వంటివి అతి సాధారణంగా జరుగుతుంటాయి.

ADVERTISEMENT

ఇలాంటి ఘటనపైనే ఒక కేసు నమోదయ్యింది. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాల సమయంలో తమిళ సినీ అభిమానులు రజనీ పోస్టర్లకు పాలాభిషేకం చేయడం అతి సాధారణం. అయితే దీనిని అరికట్టాలని, ప్రజలకు ఉపయోగపడే పాలు దుర్వినియోగం కాకూడదని బెంగళూరు కోర్టులో ఇన్ జంక్షన్ సూట్ ఫైల్ అయ్యింది. ఈ మేరకు రజనీకాంత్ తన అభిమానులకు ఒక విజ్ఞప్తి చేయాలని కోరుతూ దాఖలైన ఈ పిటిషన్ పై సూపర్ స్టార్ ఎలా స్పందిస్తారో చూడాలి.

అయితే ఇది ఒక్క రజనీ వరకే పరిమితం కాదు. దాదాపుగా అందరి హీరోల అభిమానులు చేసే పోకడే ఇది. ఈ విషయంలో రజనీకాంత్ మాత్రమే కాకుండా ఇతర ప్రముఖ హీరోలు కూడా స్వచ్చందంగా స్పందించి… తమ అభిమానుల ఆగడాలను నియంత్రించాల్సి ఉంది. బహుశా ఈ కేసులో వచ్చే తుది తీర్పు ఇందుకు అకునూలంగా రావాలని ఆశిద్దాం.

ADVERTISEMENT
Latest Stories