రాఘవేంద్రస్వామి ఆరాధోనోత్సవాలకు నారా లోకేష్‌కు ఆహ్వానం

invitation to Nara Lokesh for Raghavendra Swamy Aradhonotsavamమంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహ మూర్తి, హైదరాబాద్‌ బర్కత్ పురా బ్రాంచ్ మఠం మేనేజర్ పురాణిక్ శుక్రవారం విజయవాడలో టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ నివాసానికి వెళ్ళి మంత్రాలయం రాఘవేంద్రస్వామి 351వ ఆరాధోనోత్సవాలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు పీఠాధిపతి సుబుదేంద్రతీర్ధస్వామివారు ఇచ్చిన శేషవస్త్రం, పరిమళ ప్రసాదం, ఫలపుష్ప అక్షింతలు నారా లోకేష్‌కు అందజేసి, శాలువా కప్పి సత్కరించారు.

నారా లోకేష్‌ వారిని సాధారంగా ఆహ్వానించి, మంత్రాలయం రాఘవేంద్రస్వామి 351వ ఆరాధోనోత్సవాలకు సంబందించి వివరాలను అడిగి తెలుసుకొన్నారు. తీవ్ర సమస్యలతో తల్లడిల్లుతున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి, ప్రజలకు రాఘవేంద్రస్వామివారి దివ్యాశీసులు చాలా అవసరమని నారా లోకేష్‌ చెప్పారు. తాను కుటుంబ సమేతంగా తప్పకుండా ఆరాధనోత్సవాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకొంటానని నారా లోకేష్‌ చెప్పారు.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories