ఐపీఎల్ కబుర్లు..!

IPL 2026 Teams

మొదటిగా డిపెండింగ్ చాంఫియన్ గా 2026 ఐపీఎల్ సీజన్ బరిలోకి దిగబోతున్నారు ఆర్సీబి. ప్రస్తుతం విరాట్ ఫామ్ ఫ కూడా ఆ జట్టు అభిమానులకు ట్రోఫీ ఆశలను సజీవంగా ఉంచుతుంది. నేడు బెంగుల్ర్ వేదికగా జరగనున్న ఈ సీజన్ మొదటి మ్యాచ్లో బెంగళూరు కు ప్రత్యర్థిలా ఆడనున్న హైదరాబాద్ జట్టు తమ ఆశలన్నీ బ్యాటింగ్ పైనే పెట్టుకుందనటంలో మొహమాటమే లేదు.

ప్యాట్ కమిన్స్ వంటి అద్భుతమైన కెప్టెన్ మరియు బౌలర్ ను ఈ జట్టు తొలి 3-4 మ్యాచ్లు మిస్ అవ్వకతప్పదని ఇప్పటికే తెలిసిన అభిమానులు కాస్త ఢీలా పడ్డారు. అయితే మొన్న జరిగిన న్యూజిలాండ్ టీ – 20, టీ – 20 వరల్డ్ కప్ మ్యాచ్లలో తమ అద్భుతమైన బ్యాటింగ్ ప్రతిభతో టీం ఇండియా కు విజయాలు అందించిన ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ ఇద్దరు కూడా SRH జట్టుకి బూస్టింగ్ గా మారారు.

ADVERTISEMENT

ఆర్సీబీ ఎలా అయితే ఈసాల కప్ నందే అన్నట్టుగా SRH కూడా ఈసారి మా టార్గెట్ 300 అంటూ దూకుడుగా వ్యవహరిస్తారు. మరి ఆర్సీబీ కప్ కల 2025 సీజన్ లో నెరవేరగా, SRH 300 రన్స్ టార్గెట్ 2026 నెరవేర్చుకుంటుందా అనేది కూడా ఆ జట్టు అభిమానులను వేధిస్తుంది.

ఇక, ఎప్పుడో 2020 లో కప్ అందుకున్న ముంబై ఈసారి ఎలాగైనా ట్రోఫీ ను ఎగరేసుకుపోవాలనే ఆలోచనలో ఉన్నదో ఏమో గాని, తమ జట్టును చూస్తేనే అపోజిషన్ జట్లు సగం చావక తప్పదు అనేలా రోహిత్, సూర్య, హార్దిక్, బుమ్రా, తిలక్ వంటి అంతర్జాతీయ టీం ఇండియా ఆటగాళ్లు అందరు ఒకటే జట్టులో ఉన్నారు. ఇక ఆ జట్టు ఫారెన్ విభాగం మిచెల్ సాంత్నర్, బోష్, డి కాక్, రికెల్టన్ వంటి రాకెట్స్ ఆ జట్టు లో భాగమయ్యున్నారు.

మరో పక్క, పోయిన సీజన్ లో ఫైనల్ వరకు చేరి చివరి మ్యాచ్లో కేవలం 6 పరుగులతో ఓటమి చెంది ట్రోఫీ ను చేజార్చుకున్న పంజాబ్ జట్టు ఈసారి ఎలాగైనా తమ మొదటి ట్రోఫీ ను అందుకోవాలని చూస్తుంది. ఇందుకై శ్రేయాస్ అయ్యర్ – రికీ పాంటింగ్ ల కెప్టెన్ – కోచ్ కలయిక మీదనే పంజాబ్ ఆశలు పెట్టుకుంది.

ఇక ఇటు చెన్నై సూపర్ కింగ్స్ ఆక్షన్ కు ముందే సంజు శాంసన్ వంటి ఆటగాడ్ని ట్రేడ్ రూపంలో జట్టులోకి తెచ్చుకున్నప్పటికీ, ఆ జట్టు బౌలింగ్ బలం ఐపిఎల్ ను నెగ్గేందుకు సరిపోతుందా అని అభిమానుల అంచనా. ఉన్న ఒక్క మంచి బౌలర్ నాథన్ ఎల్లిస్ కూడా ఇంజురీ కారణంతో రూల్డ్ ఔట్ అవటం విశేషం. తాజాగా ఆ జట్టు లెజెండరీ వికెట్ – కీపర్ ఏం.ఎస్.ధోనీ ఇంజురీ కు గురయ్యాడనే వార్త ప్రస్తుతం చెన్నై అభిమానులను మరింత గాయపెడుతుంది.

ఇక కోల్కతా జట్టు కూడా ట్రోఫీ వేటలో ఏమాత్రం వెనుకంజ లో లేదు. ఇటీవలే 2024 సీజన్లో ఇలానే అండర్ – డాగ్స్ గా బరిలోకి దిగిజ కోల్కతా జట్టు ఆ ఏడాది ట్రోఫీ ను ఎగరేసుకుపోయారు. అలానే ఈసారి కూడా పెద్ద అంచనాలు లేని ఈ జట్టు మరోసారి 2024 లాంటి సీన్ ను రీక్రియేట్ చెయ్యాలని ఆశపడుతోంది.

ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారైనా ప్లే – అఫ్స్ కు చేరుకుని మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకోగా, ఇటు లక్నో జట్టు అభిమానులు తమ కెప్టెన్ పంత్ ఈసారి గతేడాది వచ్చిన ఐపిఎల్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంటాడని గట్టిగా నమ్ముతున్నారు. యువి కోచింగ్ లో పంత్ బ్యాటింగ్ చేస్తున్న వీడియో క్లిప్స్ బాగా రీచ్ అవటంతో ఈసారి ఆ జట్టు ఆశలన్నీ తమ కెప్టెన్ పైనే.

ఇక గుజరాత్ మరియు రాజస్థాన్ వంటి జట్లు ఎప్పుడో తాము మొదట ఆడిన సీజన్లోనే ట్రోఫీను అందుకుని మరోసారి ట్రోఫీ ను ముట్టలేదు. ఒకేలా ఉన్న ఈ రెండు జట్ల కథ, ఈసారైనా కప్పు కొట్టాలనే ఆశతో బరిలోకి దిగుతున్నారు. ఇలా ప్రతి జట్టు సీజన్ మొదలవకముందు ట్రోఫీ నెగ్గాలనే ఆశతోనే వచ్చినప్పటికీ ఏదో ఒక్క జట్టే ఆ ట్రోఫీ ను అందుకుంటారు. మరి ఈ సీజన్లో ఎవరు ట్రోఫీ గెలుస్తారనుకుంటున్నారు?

ADVERTISEMENT
Latest Stories