టీజర్ అంటే చిన్నగా ఉంటుంది అనుకోవడం సహజమే గానీ, మరి ఇంత చిన్నగా ఉంటుందన్న విషయాన్ని ‘ఇరుముగన్’ సినిమా టీజర్ వీక్షకులకు తెలియచెప్పింది. విక్రమ్, నయనతార జంటగా నటించిన ఈ సినిమాలో ‘హలెన’ పాట టీజర్ విడుదల చేస్తామని చెప్పిన విధంగానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాటకు సంబంధించిన వీడియో కావడంతో కనీసం ఒక ముప్పై సెకన్ల పాటు అయినా ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తారు.
అయితే విడుదల చేసిన టీజర్ నిడివి ఉంటానికి 25 సెకన్లు ఉంది గానీ, అందులో పాటకు సంబంధించిన వీడియో కేవలం 15 సెకన్లు మాత్రమే. అయితే చూపించిన ఆ తక్కువ సమయంలో… ఈ పాట అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించబడిందన్న విషయం స్పష్టమైంది. విక్రమ్, నయనతార జంట హాట్ హాట్ గా కనువిందు చేయగా, హారిస్ జయరాజ్ అందించిన సంగీతం వినసొంపుగా ఉంది. ఆగష్టు 2వ తేదీన ఈ సినిమా ఆడియో విడుదల అన్న కొత్త విషయాన్ని ఈ టీజర్ చెప్పింది.
ADVERTISEMENT
ADVERTISEMENT



