ఆర్ఆర్ఆర్ అనంతరం ఆచార్య, గేమ్ ఛేంజర్ లాంటి సినిమాల తర్వాత వచ్చిన “పెద్ది” మరో రంగస్థలం అవుతుందని సుకుమార్ సైతం ప్రామిస్ చేసాడు. కట్ చేస్తే.. కనీస స్థాయిలో కూడా అలరించలేక చతికిలపడింది.
ఇక దశాబ్దకాలంగా హిట్టు కోసం కొట్టుమిట్టాడుతున్న అఖిల్ కి “లెనిన్” ఒక మినీ రంగస్థలం అవుతుంది అన్నారు. రిలీజ్ తత్వాత అయిపోయింది అని కూడా అన్నారు. అయితే.. యావరేజ్ గా నిలిచింది.
చరణ్ కానీ అఖిల్ కానీ ప్రామిస్ చేసిన స్థాయిలో డెలివర్ చేయలేకపోయారు. ఆ లోటును భర్తీ చేసాడు రవితేజ. గత ఆరు సినిమాలతో డిజాస్టర్లు, ట్రోల్స్, కామెంట్స్ మరియు లెక్కలేనంత నెగిటివిటీ చవిచూసిన రవితేజ.. ఇరుముడితో కంబ్యాక్ ఇచ్చాడు.
ఇరుముడి అనేది కేవలం కంబ్యాక్ మాత్రమే కాదు.. గుడ్ విల్ సినిమా. ఆడియన్స్ ఎంత కరడుగట్టిన పాషాణ హృదయులు అయినా.. ఆ క్లైమాక్స్ కి కళ్లు చెమర్చుకోవాల్సిందే. ఈమధ్యకాలంలో ఈ స్థాయి ఇంపాక్ట్ ఫుల్ ఫిలిం రాలేదంటే అతిశయోక్తి కాదు.
సో రంగస్థలం లాంటి రా అండ్ రస్టిక్ డ్రామాతో ఆడియన్స్ ని ఎంగేజ్ చేద్దామని “పెద్ది”తో చరణ్ ప్లాన్ చేస్తే.. “లెనిన్”తో అఖిల్ కొంతమేరకు ట్రై చేసాడు.. రవితేజ మాత్రం ‘ఇంపాక్ట్చే’ క్రియేట్ చేసి విన్నర్ గా నిలిచాడు.





