అంతా ఆ ‘ఒక్కడి’ కోసమేనా..?

MS Dhoni

ఇటీవలే ఐపీఎల్ 2024 ముగిసింది అనుకునే లోపే అప్పుడే ఐపీఎల్ 2025 ప్రస్తావన వార్తలకెక్కింది. తాజాగా వస్తున్న ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ అప్డేట్స్ క్రికెట్ అభిమానులకు కంటి మీద కునుకు పట్టనంత పనీ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ మెగా ఆక్షన్ గురించి ఎన్నో వార్తలు బయటకి వచ్చాయి.

రిషబ్ పంత్ ను ఢిల్లీ క్యాపిటల్స్ ఆక్షన్ లో కి వదులు కోవడానికి సిద్దపడినట్లుగా, రోహిత్ శర్మ ముంబై జట్టును వీడి, రాయల్ ఛాలంజర్స్ బెంగళూరు లో కెప్టెన్ కాబోతున్నట్టు, కే.ఎల్.రాహుల్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న లక్నో జట్టును వీడి, తన సొంత జట్టు బెంగళూరు జట్టు లో కి తిరిగి రీ ఎంట్రీ ఇస్తున్నాడంటూ పలు సంచలన కథనాలు బయటకు వచ్చాయి.

ADVERTISEMENT

ఇక దానికి తోడు, గత ఐపీఎల్ హాట్ టాపిక్ గా మారిన హార్దిక్ పాండ్య ను సైతం ముంబై జట్టు ఆక్షన్ లోకి వదులుతుందంటూ, తాజా భారత టి-20 కెప్టెన్ సూర్య కుమార్ ను ముంబై తమ కెప్టెన్ గా జట్టు సారధ్య బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇలా రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ క్రికెట్ అభిమానులను ఆ ఆటగాళ్ల అభిమానులను ఉపిరిస్తున్నాయి.

అయితే అన్నిటికంటే ఉర్రుతలూగించే వార్త, తాజాగా సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది. భారత మాజీ సారధి “మహేంద్ర సింఘ్ ధోని” ఈ ఐపీఎల్ 2025 సీజన్లో ఒక అన్-కాప్డ్ ప్లేయర్ గా చెన్నై జట్టు కు మళ్ళీ ప్రాతినిధ్యం వహించబోతున్నారు అన్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు పెద్ద ఎత్తున ప్రచారంలో నిలుస్తున్నాయి.

నిజానికి ఒక ఆటగాడు తన రిటైర్మెంట్ ను ప్రకటించి ఐదేళ్లయితే, తాను ఒక అన్-కాప్డ్ ప్లేయర్ గా గుర్తింపబడతాడు అని ఐపీఎల్ లో పూర్వం ఒక రూల్ ఉండేది. ఈ రూల్ ను ఐపీఎల్ 2022 నుండి అమలులో నుండి తొలగించారు. అయితే, ఇప్పుడొస్తున్న వార్తల బట్టి చూస్తే ఆ నియమం తిరిగి అమలులోకొచ్చింది అని స్పష్టం అవుతోంది.

పైగా,ఇటీవలే ప్రెస్ కు దర్శనమిచ్చిన ఒక చెన్నై జట్టు యాజమాన్యుడు తాము బీసీసీఐ ను ఈ నియమం గురించి కోరలేదని తెలియజేసారు. ఈ రెండేళ్లు అమలు లో లేని నియమం, అకస్మాత్తు గా తిరిగి వచ్చిందంటే “ఇదంతా ధోని కోసమే” అని అంటున్నారు క్రికెట్ అభిమానులు.

అయితే, “థలా ఫర్ రీజన్ అంటూ ధోని” తిరిగి క్రికెట్ మైదానం లో కి ఎంట్రీ ఇస్తే క్రికెట్ అభిమానులకు పండగ వాతావరణం ఖాయం. చూడాలి మరి ధోని ఈ నియమంతో తిరిగి చెన్నై జట్టు లో అడుగు పెడతాడా..? లేదా ఈలోపే తాను ఐపీఎల్ రిటైర్మెంట్ కూడా ప్రకటిస్తాడా..?

ADVERTISEMENT
Latest Stories