నాగచైతన్య సమంత విడాకులు… అదే కారణమా?

is that the reason naga chaitanya samantha taking divorceతమ నాలుగేళ్ళ వివాహ బంధాన్ని ముగిస్తున్నట్టు నాగచైతన్య – సమంత ప్రకటించారు. ఇద్దరి తరపున కాసేపటి క్రితం నాగచైతన్య తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటన చేశారు. కారణం ఏంటి అనేది చెప్పకుండా ఈ సమయంలో తమను ప్రశ్నలతో ఇబ్బంది పెట్టొద్దని రిక్వెస్ట్ చేశాడు.

ఈ విడాకులకు కారణం ఏమయ్యుంటుంది అనే దాని మీద మీడియాలో ఇప్పటివరకూ ఎన్నో చర్చలు జరిగాయి. అయితే వారికీ, కుటుంబసభ్యులకు తప్ప ఎవరికీ ప్రస్తుతానికి ఆ విషయం తెలీదు. నాగచైతన్య సినిమాల వరకు ఉన్న ఇమేజ్ చూస్తే చాలా కామ్ గోయింగ్… ఎప్పుడూ కూడా వివాదాలు లేవు.

ADVERTISEMENT

అతనికి గతంలో ఆఫ్ఫైర్లు ఉన్నట్టుగానీ ఇంకోటి గానీ ఎక్కడా వినిపించలేదు. అసలు అటువంటి షేడ్ కూడా నాగచైతన్య లో ఎప్పుడూ కనబడదు. ఇక సమంతకు గతంలో ఒక రిలేషన్ ఉన్న సంగతి తెలిసిందే. అది కూడా హానెస్ట్ రిలేషనే తప్ప ఇంకోటి కాదు. నాగచైతన్య తో రిలేషన్ లో కూడా ఆమె హానెస్ట్ గానే కనిపించేది.

మరి వారిద్దరికీ ఇబ్బంది కలిగించే విషయం ఏదన్నా ఉంటే అది ఇద్దరి అంతస్తులు… అలాగే చిత్ర పరిశ్రమలో వారి స్థాయి. అంతస్తులు విషయంలో నాగచైతన్య పైనా ఉంటే కెరీర్ పరంగా సమంతదే పై చెయ్యి. అంతస్తుల తేడా అయితే అసలు పెళ్లి దాకా వెళ్లే అవకాశాలు చాలా తక్కువ. ఇక కెరీర్ పరంగా ఉన్న హెచ్చు తగ్గుల వల్లే వారి విడాకులు జరిగి ఉండవచ్చని చాలా మంది అభిప్రాయం. 

అయితే వారి పరిచయం మొదటి నుండీ ఆ విషయంలో ఎప్పుడూ సమంత దే పై చెయ్యి. అయితే నిత్యం కలిసి ఉండే భార్యాభర్తల మధ్య ఒక్క చిన్న ఇష్యూ రావడం అది పెద్దది కావడం ఎంత సేపు? ఏది ఏమైనా టాలీవుడ్ లో మరో జంట విడాకుల దిశగా అడుగులు వేసింది.

ADVERTISEMENT
Latest Stories