బిఆర్ఎస్ కన్నా వైసీపీ బలమైనదా..? లేక టీడీపీ కన్నా టి. కాంగ్రెస్ పదునైనదా.?

Is YSRCP Stronger Than BRS in Opposition?

అవును ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతిపక్షాల పై ప్రభుత్వ తీరు చూస్తున్నా, ప్రభుత్వాల పై ప్రతిపక్షాల హంగామా గమనిస్తున్నా బిఆర్ఎస్ కన్నా వైసీపీ బలమైనదా.? లేక టీడీపీ కన్నా టి. కాంగ్రెస్ పదునైనదా.? అన్న ప్రశ్న తలెత్తుతుంది.

తెలంగాణలో బిఆర్ఎస్ 39 సీట్లతో ప్రతిపక్ష హోదాలో కొనసాగగా దాని సంఖ్యను కాంగ్రెస్ ప్రభుత్వం తన అధికారంతో 27 కి కుదించింది. అలాగే బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఫామ్ హౌస్ కి అపరిమితం చెయ్యగలిగింది.

ADVERTISEMENT

ఇటు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే 11 సీట్లతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ని దాని అసత్య ప్రచారాలను కూటమి గా ఉన్న టీడీపీ తన అధికారంతో అడ్డుకోలేకపోతుంది, అలాగే ఆ పార్టీ అధినేత నే కాదు హద్దులు దాటి విమర్శలకు దిగుతున్న ఆ పార్టీ అధికార ప్రతినిధిని సైతం భయపెట్టలేకపోతోంది.

పదేళ్ల అధికారాన్ని అనుభవించిన బిఆర్ఎస్ కూడా ప్రతిపక్షంగా సాహసించలేని కార్యాలను కేవలం ఒక్క ఛాన్స్ తో వైసీపీ ప్రతిపక్ష హోదా లేకున్నాడనే పూర్తి చేసేస్తుంది. నిత్యం వైసీపీ సోషల్ మీడియా నుంచి వైసీపీ సాక్షి వరకు ప్రభుత్వ నిర్ణయాల పై తప్పుడు కథనాలు,

అలాగే పార్టీ అధినేత వైస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి పార్టీ కార్యకర్తల వరకు కూటమి ప్రభుత్వం పై, ప్రభుత్వ విధానాల పై అసత్య ప్రచారాలు, రప్ప రప్ప రాజకీయాలు సాగిస్తూనే ఉంటున్నారు. చివరికి రాష్ట్ర రాజధాని ని సైతం కూల్చే వైసీపీ విధ్వంశపు రాజకీయాన్ని కూడా కూటమి నిరువరించలేకపోతుంది.

ఒకపక్క హైడ్రా వంటి రేవంత్ రెడ్డి కూల్చివేతల నిర్ణయాన్ని సైతం బిఆర్ఎస్ బలం గా ఎదిరించలేకపోతుంటే మరోపక్క పిపిటి వంటి ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య నిర్మాణాల నిర్ణయాన్ని వైసీపీ కూటమి తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయంగా ప్రచారం చేయగలుగుతుంది, ప్రజలను తప్పుదోవ పట్టించగలుగుతుంది.

అలాగే అక్కడ తెలంగాణలో బిఆర్ఎస్ నుంచి కేవలం కేటీఆర్, హరీష్ మాత్రమే రేవంత్ సర్కార్ పై దూకుడుగా ముందుకెళ్తున్నారు, కానీ ఇక్కడ ఏపీలో వైసీపీ నుంచి పార్టీ అధికార ప్రతినిధి నుంచి పార్టీ మాజీ ఎమ్మెల్యేలు పేర్ని నాని, అంబటి, గుడివాడ అమర్నాధ్, రోజా, భూమన, అవినాష్, జోగి…ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ వరకు అందరు ప్రభుత్వం పై ప్రభుత్వాధిపతుల పై విరుచుకుపడిపోతున్నారు.

అయితే ఇటువంటి పరిస్ట్రితులను చూసినప్పుడే ఇక్కడ బిఆర్ఎస్ కన్నా వైసీపీ బలమైనది అనుకోవాలా.? లేక కూటమి కన్నా కాంగ్రెస్ పదునైనది అని భావించాలా.? కూటమి సహనం వైసీపీ సాహసానికి బలంగా మారిందా.? కాంగ్రెస్ అధికారం బిఆర్ఎస్ లో భయం పుట్టించగలిగిందా.? అన్న ప్రశ్నలు తలెత్తుతాయి.

ADVERTISEMENT
Latest Stories