ఇస్మార్ట్ శంకర్ పై తొందరపాటు నిర్ణయం తీసుకున్నారా?

Ismart -Shankar - Release dateపూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ జూలై 12న విడుదల కావాల్సి ఉంది. అయితే వరల్డ్ కఫ్ ఫైనల్ జూలై14న జరగనుంది. వరల్డ్ కప్ క్రికెట్ ఫీవర్ తో జనాలు పెద్దగా థియేటర్స్‌కి రారు. కాబట్టి వరల్డ్ కప్ ఫైనల్స్ ఇంపాక్ట్ చిత్రంపై పడే అవకాశం ఉందని, కాబట్టి చిత్రబృందం ఛాన్స్ తీసుకోకుండా చిత్రాన్ని వాయిదా వేశారు. ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ డేట్‌ను జూలై 12 నుంచి 18కి వాయిదా వేసింది చిత్ర బృందం.

ADVERTISEMENT

అయితే ఇది కొంత తొందరపాటు నిర్ణయంగా కనిపిస్తుంది. వరల్డ్ కప్ ఫైనల్స్ లో టీం ఇండియా చేరితేనే సినిమాల మీద ప్రభావం ఉంటుంది. ఇప్పటివరకూ ఫైనలిస్టులు ఎవరో తేలలేదు. ఇప్పటివరకూ ఈ టోర్నమెంట్ లో టీం ఇండియా అజేయంగా ఉంది. అయితే టోర్నమెంట్ తరువాతి స్టేజిలో ఏదైనా జరగొచ్చు. దీనితో వారు కొంత వేచి చూడాల్సింది. ఈ సినిమా వాయిదా పడటంతో సుందీప్ కిషన్ నిన్ను వీడని నీడను నేనే చిత్రానికి సోలో రిలీజ్ లభిస్తుంది.

18న బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు, ఆ తరువాతి రోజున సంపూర్ణేష్ బాబు కొబ్బరిమట్ట సినిమాలు ఉన్నాయి. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, ఛార్మిలు సంయుక్తంగా ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, నభా నటేశ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గత కొంత కాలంగా పూరి జగన్నాధ్ కు సరైన హిట్ లేదు. అలా అని రామ్ కేరీర్ కూడా పెద్ద ఆశాజనకంగా ఏమీ లేదు. దీనితో వారు ఇరువురూ ఈ సినిమా మీద భారీ ఆశలే పెట్టుకున్నారు.

ADVERTISEMENT
Latest Stories