ఇది రాజమౌళికి కూడా తెలియదేమో!

Jabardasth Adi Punch On Baahubali 2దాదాపుగా అయిదేళ్ళ పాటు ఎంతోమంది కష్టపడి తెరకెక్కించిన రాజమౌళి “బాహుబలి” సినిమా మూలకధ ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే… ఇద్దరి అన్నదమ్ముల మధ్య జరిగే అంతర్యుద్ధం. నూటికి తొంభై తొమ్మిది పాళ్ళు ఇలాగే ఆలోచిస్తారు. అందులో కొత్తదనం ఏముంటుంది? మరి మన ‘హైపర్ ఆది’ లాంటి ఒక్క శాతం కూడా ఉంటారు కదా..! వాళ్ళ భావనలో ‘బాహుబలి’ థీమ్ ఏంటి? అంటే… తల్లికి – పెళ్ళానికి మధ్య నలిగిపోవడం ‘బాహుబలి’ వంటి మహా వ్యక్తికైనా తప్పలేదు అని!

నిజానికి వినగానే ఇదొక పంచ్ లాగానే ఉంటుంది గానీ… ‘బాహుబలి’ కధ అసలు మలుపు తిరిగింది మాత్రం… ఇక్కడి నుండే..! ఎప్పుడైతే కాబోయే శ్రీమతి పక్కన నిల్చుని, తల్లికి ఎదురుచెప్తాడో… అక్కడే ‘బాహుబలి 2’లో ప్రేక్షకులకు ఏమోషన్ కనెక్ట్ అయ్యింది. ఇక అక్కడ్నుండి కుటుంబ భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలు రక్తి కట్టించాయి. తల్లికి ఎదురుచెప్పే సన్నివేశంలో ఎవరిది తప్పు ఉండదు గానీ, ఫ్యామిలీ ఏమోషన్స్ అంటే అలాగే ఉంటాయన్నది అందరికీ తెలిసిందే… దానినే హైపర్ ఆది ‘బాహుబలి’ థీమ్ గా ప్రజెంట్ చేసాడు.

ADVERTISEMENT

వర్తమాన అంశాలను తన స్కిట్ లో వేసుకుని, బుల్లితెరపై ‘జబర్దస్త్’ ద్వారా నవ్వులు పండించే హైపర్ ఆది, తాజాగా ‘బాహుబలి’పై వేసిన పంచ్ ఇది. ‘బాహుబలి 2’ నుండి నీకేం అర్ధమైంది ఆది అంటూ యాంకర్ అనసూయ అడగగా… ఏముంది… ఎంతటి బాహుబలి అయినా తల్లికి – పెళ్ళానికి మధ్య బలవ్వాల్సిందేనని అర్ధం చేసుకున్నా… అంటూ పంచ్ వేసాడు. బహుశా ఇదే సినిమా థీమ్ అని రెండు పార్టులు తీసిన రాజమౌళికి కూడా తెలుసో లేదో… వింటున్నారా జక్కన్న… హైపర్ ఆది పంచ్..!

ADVERTISEMENT
Latest Stories