నేడు రాష్ట్రంలో కాకినాడ, నర్సీపట్నం అంటూ ఇద్దరు కీలక నేతల పర్యటనలు జరిగిన వేళ ఇందులో ఎవరి పర్యటన ప్రజలకు మేలు చేసింది.? ఎవరి సందర్శనలు సమస్యకు పరిష్కారం చూపాయి అనేది ఒక్కసారి పరిశీలిద్దాం.
ముందుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటన విషయానికొస్తే., ఇక్కడ పర్యటన బాధితులకు ఆర్థిక సాయం చేసింది, సమస్యల పరిష్కారం దిశగా సాగింది.
ఉప్పాడ తీరప్రాంత మత్స్యకార్యులతో మాటామంతి కార్యక్రమాలో పాల్గొన్న పవన్, సముద్రంలో వేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన 18 కుటుంబాలకు 5 లక్షల చొప్పున మొత్తం 90 లక్షల ఆర్థిక సాయం అందించారు. అలాగే మత్స్యకారులు లేవనెత్తిన పారిశ్రామిక కాలుష్య సమస్యల పై ఆడిట్ నిర్వహించాలని పీసీబీ ని ఆదేశించారు.
అలాగే ఈ అంశం పై వారం రోజులలో తనకు నివేదిక అందివ్వాలంటూ అధికారులకు అల్టిమేటం జారీచేశారు, దానికి తోడు ఈ సమస్య పై పూర్తి అధ్యయనం చేసి ప్రభుత్వం తరుపున సమస్యకు100 రోజులలో పరిష్కారం చూపుతామంటూ హామీ ఇచ్చారు.
323 కోట్ల వ్యయంతో ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ నిర్మిస్తానంటూమాట ఇచ్చిన పవన్, ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఉప్పాడ – కొణపాక మధ్య జరుగుతున్న తీరా రక్షణ పనులను వివరించారు. అలాగే పరిశ్రమల నుంచి శుద్ధి చేయకుండా వస్తున్న వ్యర్ధాలను సముద్రంలో కలపడం పై కూడా పవన్ ఆరా తీశారు.
ఇక వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే వైస్ జగన్ నర్సీపట్నం లో వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణానికి నోచుకోని మెడికల్ కాలేజీ సందర్శనకు వెళ్లారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల నిర్మాణాలను పీపీపీ విధానంలో పూర్తి చేయాలనడం దారుణం అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు జగన్.
వైసీపీ హయాంలో జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాలకు శంకుస్థాన చేస్తే కూటమి ప్రభుత్వం వాటిని పీపీపీ విధానంతో ప్రవైట్ పరం చేస్తుందంటూ ఆరోపణలకు దిగిన జగన్ ఆ ఆరోపణలు చేయడానికి అర్హుడేనా అన్న చర్చ జరుగుతుంది.
గత ఐదేళ్లు టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది అనే ఒకే ఒక్క కారణంతో రాష్ట్ర రాజధాని అమరావతిని సమాధి చేసి రాష్ట్ర భవిష్యత్ ను మూడు ముక్కలాట ఆడిన జగన్ ఇప్పుడు పీపీపీ విధానంలో వైసీపీ చేపట్టిన నిర్మాణాలను బాబు పూర్తి చేయాలనుకోవడం నేరం అవుతుందా.?
జగన్ పర్యటనతో సమస్యకు పరిష్కారం దొరికిందా.? లేక అసలు లేని సమస్యను సమస్యగా సృష్టించాలనుకుంటున్నారా.? ఈ పర్యటన జగన్ తన బలప్రదర్శన కోసం చేసారా.? లేక ప్రజల హక్కులకు బలంగా నిలవడానికి చేసారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.




