
తమ్ముడు తమ్ముడే… పేకాట పేకాటే… అన్నట్లు జగన్, షర్మిల మద్య కూడా ఆర్ధిక సంబంధాలు అలాగే ఉన్నాయి. ఆస్తి పంపకాల విషయంలో జగన్ ఆమెతో రాజీపడుతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలోనే షర్మిలకి తన కంపెనీలో వాటా ఇచ్చే ప్రసక్తి లేదంటూ జగన్ కోర్టులో కేసు వేసిన వార్తా బయటకు పొక్కింది.
Also Read – పవన్ త్రిబుల్ రైడింగ్: జనసేనకు ప్రమాదం..!
జగన్, భారతీ దంపతులకు అనేక వ్యాపారాలు, కంపెనీలు ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్. జగన్ ముఖ్యమంత్రి అయిన కొత్తలో అంటే 2019, ఆగస్ట్ 21న దానిలో చెల్లి వైఎస్ షర్మిలకి వాటా ఇస్తూ ఎంఓయూ (ఒప్పంద పత్రం)పై సంతకాలు చేశారు. కానీ ఆ తర్వాత ఆస్తుల పంపకాలలో వారిద్దరి మద్య విభేధాలు తలెత్తడంతో ఆమె తెలంగాణకు వెళ్ళిపోయి సొంత పార్టీ పెట్టుకున్నారు.
కానీ 2024 ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆమె ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి అన్న జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రస్థాయిలో విరుచుకు పడటం అందరికీ తెలుసు.
Also Read – బనకచర్లలో పారే నీళ్ళకంటే రాజకీయాలే ఎక్కువ?
ఆ కారణంగా తమ కంపెనీలో చెల్లికి వాటా ఇవ్వదలచుకోలేదని, అందుకోసం ఆమెతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామని జగన్ దంపతులు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్లో కిందటి నెల 10వ తేదీన పిటిషన్ వేశారు.
కంపెనీల చట్టంలోని సెక్షన్ 59కింద కంపెనీ యాజమాన్యం ఏ డైరెక్టర్ లేదా కంపెనీ నుంచి ఆర్ధిక లబ్ధి పొందుతున్నవారిని ఎవరినైనా తొలగించవచ్చు. ఆ సెక్షన్ కిండా వైఎస్ షర్మిలతో తాము చేసుకున్నా ఒప్పందాన్ని రద్దు చేసుకొని ఆమెను తొలగిస్తున్నామని జగన్ దంపతులు ఆ పిటిషన్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
Also Read – జగన్ పరామర్శ కార్యకర్త కోసం కాదట!
అది వారి సొంత కంపెనీ కనుక వైఎస్ షర్మిల దానిలో పదవి లేదా వాటా కోసం పట్టుబట్టలేరు. కానీ తన అన్నావదిన తనను ఏవిదంగా మోసం చేశారో చాటింపు వేసుకోవడానికి ఇది తప్పకుండా ఉపయోగపడుతుంది.
ఈ తాజా పరిణామం వైఎస్ షర్మిల పట్ల జగన్ వైఖరిలో ఎటువంటి మార్పు లేదని, ఆమెకు ఆస్తిలో వాటాలు పంచి ఇచ్చేందుకు ఇష్టపడటం లేదని ఆమెతో యుద్ధానికే సిద్దం అవుతున్నారని స్పష్టం చేస్తోంది.
చెల్లిని, తల్లిని తన రాజకీయ ఎదుగుదలకి నిచ్చెనలుగా వాడుకొని అధికారంలోకి వచ్చాక వారిని నిర్ధాక్షిణ్యంగా బయటకు గెంటేసిన జగన్ జాబితాలో పలువురు వైసీపి నేతలు, వాలంటీర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఉండటం విశేషం. అయినా నా అక్కా చెల్లెమ్మలు, అవ్వలు తాత్తయ్యలు అంటూ దీర్గాలు తీస్తూ ప్రేమ ఒలకబోయడాన్ని ఏమనుకోవాలి?