నీట్ సమస్యపై ఢిల్లీలో సీజేపీ ఆందోళనలు దేశంలోని రాజకీయ పార్టీల ఆలోచన విధానంపై తీవ్ర ప్రభావం చూపాయి. ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలు జెన్-జీ మంత్రం పటిస్తుండటమే ఇందుకు నిదర్శనం.
వచ్చే ఎన్నికలలో 50 శాతం పైగా జెన్-జీ ఓట్లే పడతాయని కేటీఆర్ కలలు కంటుంటే, జగన్ బల ప్రదర్శనలలో పాల్గొన్న వారందరూ జెన్-జీలే అని చెప్పుకోవడం మొదలుపెట్టారు.
అయితే ఈ రెండు పార్టీల హడావుడి చూస్తుంటే, ఇంతకాలం జెన్-జీ (యువత) లేదా?వారు రాజకీయాలలో పాల్గొనడం లేదా? వారికి ఓటు హక్కు ఇంకా లభించ లేదా? అనే సందేహాలు కలుగుతాయి.
వైసీపీలో ‘రప్పారప్పా’ అంటూ రెచ్చిపోతున్నవారిలో చాలా మంది యువకులే కదా?పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నవారికి కొత్తగా ఈ ‘జెన్-జీ రంగు’ దేనికి?అంటే రంగులు మార్చడం అలవాటు కనుకనా?
లేదా ‘రప్పారప్పాలు’గా ప్రసిద్ధి చెందిన వారందరికీ ‘రాముడు మంచి బాలుడు’ అనే లేబిల్ వేసేందుకా? లేక రప్పారప్పాలను చూపించుకుంటూ ఆంధ్రా జెన్-జీ మొత్తం తన వెంటే ఉందని చెప్పుకునేందుకా? అంటే అన్నీను అని సమాధానం చెప్పుకోవాలేమో?
ఢిల్లీలో జెన్-జీకి వారి తల్లితండ్రులు, మహిళలు, సినీ, పారిశ్రామిక, రాజకీయ ప్రముఖులు సంఘీభావం ప్రకటించారు. చివరికి ఐఖ్యరాజ్య సమితి కూడా స్పందిస్తూ వారి పట్ల ప్రభుత్వం మానవతా దృక్పదంతో వ్యవహరించాలని సూచించింది.
కానీ ‘రప్పారప్పాలను’ వారు చేస్తున్న ఇలాంటి పనులను వారి సొంత కుటుంబ సభ్యులైన సమర్ధిస్తారా?మెచ్చుకుంటున్నారా?
ఢిల్లీలో జెన్-జీ చాలా క్రమశిక్షణ, ఓర్పుతో ఆందోళనలు కొనసాగించి, నెలరోజులుపైగా జంతర్ మంతర్ వద్ద పేరుకు పోయిన చెత్తా చెదారం అంతా స్వయంగా తొలగించిన తర్వాత వెళ్ళిపోయారు. రప్పారప్పాలకు అటువంటి మంచి లక్షణాలున్నాయా?
వైసీపీ జెన్-జీలకు ఇలాంటి బల ప్రదర్శనలు కాకుండా జీవితంలో వేరేవైనా లక్ష్యాలున్నాయా? ఈవిధంగా వ్యవహరిస్తుంటే నీట్ వంటి లక్ష్యాలు సాధించగలరా?అని ఎవరికి వారు ఆలోచించుకోవాలి.
‘జెన్-జీ గుండె చప్పుడు జగన్’ అని వారిని చూపించుకొని రాజకీయంగా వైసీపీ లబ్ది పొందగలదు. కానీ జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాల్సిన జెన్-జీలు రప్పారప్పాలుగా మారి కేసులలో చిక్కుకుంటే నష్టపోయేది వారే తప్ప వైసీపీ కాదు కదా?
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను పక్కన పడేసి వాలంటీర్లను వాడుకుంది. వైసీపీని నమ్ముకొని కేవలం నెలకి రూ.5వేల జీతానికి 5 ఏళ్ళు చాకిరీ చేసిన వాలంటీర్లను రోడ్డున పడేసింది. అప్పుడు కార్యకర్తలు, తర్వాత వాలంటీర్లు, ఇప్పుడు జెన్-జీ పేరుతో రప్పారప్పాలు… ఎవరు ఎవరిని వాడుకుంటున్నారు? ఎవరు బాగుపడతారు ఎవరు చెడిపోతారు?నిజంగా జెన్-జీ అయితే ప్రతీ ఒక్కరూ ఆలోచించుకోవాల్సిందే!
రప్పారప్పాలు జెన్-జీగా ఎప్పుడు మారారప్పా?