రాజకీయ పార్టీల పాలిట ‘త్రినేత్రం’ గా సోషల్ మీడియా…

Jagan Mohan Reddy's U-Turns on Amaravati, Bhogapuram

మాటజారడం….మాటతిప్పడం రాజకీయాలలో సరిదిద్దుకోలేని పొరపాట్లే అవుతాయని అని వైసీపీ పార్టీని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ని చూస్తే యిట్టె అర్ధమవుతుంది. రాష్ట్ర రాజధాని అమరావతి విషయం నుంచి భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణం వరకు వైఎస్ జగన్ నాడు మాట జారారు, నేడు మాట మార్చారు.

2019 ఎన్నికలకు ముందు రాష్ట్ర రాజధానిగా అమరావతి కి ఒకే చెప్పి, రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలు సరిపోవు అంతకు మించి కావాలి అంటూ నాడు జగన్ మాట జారారు, ఇక ఆ తరువాత రాష్ట్రానికి ఒక్క రాజధాని సరిపోదు మూడు రాజధానులు కావాలి అంటూ అదే రాజధాని విషయంలో మాట మార్చారు.

ADVERTISEMENT

అలాగే నాడు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పక్కనే విశాఖ ఇంటర్ నేషనల్ ఎయిర్ ఫోర్ట్ ఉండగా భోగాపురం ఎయిర్ ఫోర్ట్ అవసరమేముంది.? ఎర్ర బస్సు కూడా రాని ప్రాంతానికి ఎయిర్ బస్సు ఎందుకు.? అంటూ జగన్ భోగాపురం విషయంలో నోరు జారిన జగన్,

కట్ చేస్తే నేడు వైభవంగా భోగాపురం ఎయిర్ ఫోర్ట్ ప్రారంభోత్సవం జరుపుకుంటున్న ఈ సమయంలో భోగాపురం ఎయిర్ ఫోర్ట్ నిర్మాణం క్రెడిట్ తమదే అంటూ మాట మారుస్తున్నారు. నాడు రాజధాని అమరావతి విషయంలో 33 వేల ఎకరాలు సరిపోవు అంటూ వాదించిన జగన్ నేడు అమరావతి నిర్మాణానికి అన్ని వేల ఎకరాలు ఎందుకు అంటూ బాబు ఆలోచనలను విమర్శిస్తున్నారు.

ఇక భోగాపురం విషయంలో కూడా నాడు ఆ ప్రాంతానికి ఎయిర్ ఫోర్ట్ అవసరమే లేదని వాదించిన జగన్ నేడు తమ చొరవతోనే భోగాపురం పూర్తియిందంటూ కూటమి ప్రభుత్వం పై క్రెడిట్ చోరీ ఆరోపణలు చేస్తున్నారు. గతంలో 2014 టీడీపీ ప్రభుత్వ హయాంలో అనంతపూర్ లో కీయ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేసినప్పుడు కూడా వైసీపీ దాన్ని హేళన చేసింది.

కానీ 2019 వైసీపీ అధికారంలోకి వచ్చాకా ఏపీలో కియా ఏర్పాటు వెనుక తన తండ్రి, దివంగత ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పాత్ర ఉందంటూ మాట మార్చారు. ఇలా జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఒకలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాటలు జారుతూ, మాటలు మార్చుతూ చేస్తున్న రాజకీయం వైసీపీ నేతలు మరిచిపోయినా సోషల్ మీడియా గుర్తు చేస్తూనే ఉంటుంది.

జగన్ నాడు పలికిన చిలక పలుకులు నేడు కూస్తున్న కోయిల అరుపులు అన్ని కూడా సోషల్ మీడియా ప్రజల ముందు ఉంచుతుంది. దీనితో రాజకీయ పార్టీలకు, ఆయా పార్టీల నేతల పాలిట సోషల్ మీడియా ఒక త్రినేత్రంగా మారిపోయింది అనే వాదన బలపడుతుంది. ఇకనైనా పార్టీల అధినేతలు, నాయకులు తాము చేసే ప్రకటనల విషయంలో ఆచితూచి అడుగేయడం శ్రేయస్కరం..!

ADVERTISEMENT
Latest Stories