Jagan, YSRCP React to Chandrababu Naidu's Davos Pitch

సిఎం చంద్రబాబు నాయుడుపై బురద జల్లాలనే తాపత్రయంతో దావోస్‌ సదస్సులో ఏం జరిగిందో తెలుసుకోకుండానే వైసీపీ నేతలు, వారి సొంత మీడియా విషం కక్కేశారు. కానీ బీపీసీఎల్‌ కంపెనీ గేట్స్ వంటి ప్రముఖులతో పరిచేయలున్న సిఎం చంద్రబాబు నాయుడు దావోస్‌ సదస్సుకి వెళితే పెట్టుబడులు రాకపోవడం ఏమిటి?అని ఆలోచించలేదు.

Also Read – జగన్‌ 2.0: ఏపీకి, చంద్రబాబుకి మరింత కష్టమే!

ముందు ఆయనపై బురద జల్లేస్తే ఓ పనైపోతుందనుకుని అందరూ రెచ్చిపోయారు. రెడ్ బుక్ రాజ్యాంగం వల్లనే ఏపీకి పెట్టుబడులు రాలేదని మాజీ మంత్రి రోజా కనిపెట్టి చెప్పారు. కానీ పారిశ్రామికవేత్తలు జగన్‌ని చూసే భయపడుతున్నారనే విషయం ఆమె చెప్పలేరు.

సిఎం చంద్రబాబు నాయుడు తిరిగి రాగానే శుక్రవారం ఉండవల్లిలో తన నివాసంలో వివిద శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. దావోస్‌ సదస్సులో పారిశ్రామికవేత్తలు, ఐటి కంపెనీల సీఈవోలతో జరిగిన సమావేశాల గురించి వారికి వివరించి, త్వరలోనే వారందరూ రాష్ట్రంలో పర్యటించేందుకు రాబోతున్నారని చెప్పారు.

Also Read – జగన్‌కి ఓదార్పు కావాలి.. ఎవరైనా ఉన్నారా ప్లీజ్?

కనుక సదస్సులో వారికి తాము చెప్పిన ప్రకారం రాష్ట్రంలో ఎక్కడెక్కడ భూములు కేటాయించగలమో, వాటిలో ఎటువంటి మౌలికసదుపాయాలు కల్పించగలమో వివరించేందుకు పూర్తి సమాచారంతో అందరూ సిద్దంగా ఉండాలని సిఎం చంద్రబాబు నాయుడు వారికి సూచించారు.

వారు రాష్ట్రంలో పర్యటించినప్పుడు సహజ, మానవ వనరులు, ముడి సరుకు, రవాణా సౌకర్యాలు, వ్యాపారావకాశాలు వంటివన్నీ వివరించి వారితో రాష్ట్రంలో భారీ పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టించేందుకు అధికారులు తమ వంతు ప్రయత్నాలు చేయాలని సిఎం చంద్రబాబు నాయుడు వారికి సూచించారు.

Also Read – మనోభావాలను….మానసిక క్షోభను ‘గాలి’కొదిలేసినట్టేనా.?

ఈసారి సదస్సులో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పెట్టుబడులు సాధించుకోవడంపైనే ఎక్కువ శ్రద్ద చూపుతూ వీలైనంత వరకు సాధించుకుని తిరిగి వెళ్ళారు. కానీ చంద్రబాబు నాయుడు బృందం వారికి భిన్నంగా వివిద దేశాల ప్రతినిధులతో, పారిశ్రామికవేత్తలు, ఐటి కంపెనీల ప్రతినిధులతో సమావేశాలకే పరిమితమైంది.

ఆ సమావేశాలలో రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటి కంపెనీలు స్థాపించడానికి చాలా అనువైనదని వివరించినప్పటికీ, స్వయంగా నిర్ధారించేందుకు రాష్ట్రంలో పర్యటించాలని అందరినీ ఆహ్వానించారు. వారు సానుకూలంగా స్పందించినందునే సిఎం చంద్రబాబు నాయుడు అధికారులను సిద్దంగా ఉండాలని చెపుతున్నారని భావించవచ్చు.

దేశవిదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, ఐటి కంపెనీలను దావోస్‌ సదస్సులో కలవడం గొప్ప కాదు. వారందరినీ రాష్ట్రానికి రప్పించి పెట్టుబడులు పెట్టేలా చేయడమే ఇంకా గొప్ప కదా?

సిఎం చంద్రబాబు నాయుడు సదస్సుకి వెళ్ళి వంద కోట్లు తగలేశారు తప్ప ఒక్క రూపాయి తీసుకురాలేదంటూ వైసీపీ నేతలు నోటికి వచ్చిన్నట్లు చాలా అవహేళనగా మాట్లాడేశారు.

కనుక రేపు పారిశ్రామికవేత్తలు, ఐటి కంపెనీల సీఈవోలు అమరావతికి వచ్చి ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంటే జగన్‌, వైసీపీ నేతలు జీర్ణించుకోవడం చాలా కష్టమే.

అది చూసి “మాకు ఈ చిన్న సంతోషం లేకుండా చేస్తావా బాబూ?”అని జగన్‌కి, వైసీపీ నేతలు తిట్టుకోకుండా ఉంటారా?