రియల్ : హీరోను వెంటాడి పట్టుకున్న పోలీసులు!

Jai Caught by police‘జర్నీ’ సినిమాతో తెలుగునాట పాపులర్ అయిన తమిళ హీరో జై, ఆ తర్వాత టాలీవుడ్ బ్యూటీ అంజలితో ప్రేమాయణం నడిపి మరింత హాట్ టాపిక్ గా మారారు. అయితే ప్రస్తుతం వీరిద్దరి ప్రేమకు బ్రేకప్ పడిందని గుసగుసలు వినపడుతున్నాయి. ప్రేమ సంగతి పక్కన పెడితే, పబ్లిక్ లో జై వ్యక్తిగత ప్రవర్తన విమర్శలకు తావిస్తోంది. దీని వలనే తాజాగా పోలీసులు జై కారును చేజ్ చేసి మరీ పట్టుకోవాల్సి వచ్చింది.

మంగళవారం రాత్రి నుంగంబాక్కమ్ మెయిన్ రోడ్డులో ఆగకుండా పెద్ద శబ్దంతో హార్న్ మ్రోగించుకుంటూ వెళ్ళడంతో, తోటి ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. పక్కన ఆసుపత్రి ఉన్నప్పటికీ లెక్క చేయకపోవడంతో, పోలీసులు జై కారును వెంబడించి పట్టుకున్నారు. ధ్వని కాలుష్యంపై అవగాహన కల్పించగా, ఆ తర్వాత జై క్షమాపణలు చెప్పడంతో, పోలీసులు హెచ్చరించి వదిలిపెట్టారు. అయితే పబ్లిక్ లో అనుచితంగా ఇలా ప్రవర్తించడం జై కు కొత్తేమీ కాదు.

ADVERTISEMENT

గతేడాది సెప్టెంబరులో మద్యం తాగి కారు నడుపుతూ అడయారు బ్రిడ్జి సమీపంలో గోడను ఢీకొట్టి ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. దీంతో డ్రంకెన్ డ్రైవ్ కేసులో అతడి డ్రైవింగ్ లైసెన్స్‌ను ఆరు నెలల పాటు రద్దు చేశారు. అంతకుముందు 2014లో కేకే నగర్ సమీపంలోని కాశీ థియేటర్ ప్రాంతంలో మద్యం మత్తులో ఏకంగా ట్రాఫిక్ పోలీసుల వాహనాన్ని ఢీ కొట్టాడు. తాజాగా మరోమారు చెన్నయ్ లో తన అనుచిత ప్రవర్తనతో పోలీసులకు చిక్కాడు.

ADVERTISEMENT
Latest Stories