‘జై’ రూపంలో… అలా వచ్చాడో లేదో… అన్ని రికార్డులను ఇలా ఓ తొక్కు తొక్కుతున్నాడు ‘యంగ్ టైగర్.’ అవును… సోషల్ మీడియాలో వైరల్ అయిన “జై లవకుశ” టీజర్, టాలీవుడ్ లోని గత సినిమాల రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం అన్న సంకేతాలు తొలి గంటలోనే వచ్చేసాయి. ఎందుకంటే… ఒక గంట కూడా గడవకముందే 1 మిలియన్ క్లిక్స్ ను అందుకుని సరికొత్త చరిత్రను సృష్టించాడు ‘బుడ్డోడు.’
ఒక్క క్లిక్స్ విషయంలోనే కాదు, లైక్స్ విషయంలో కూడా ‘బాహుబలి’ రికార్డులను దాటేస్తాడేమో అనేటంతగా దూసుకెళ్తున్నాడు. గంట సమయానికే దాదాపుగా 80 వేల లైక్స్ తో అనూహ్యమైన రికార్డ్ ను అందుకునేలా కనపడుతున్నాడు. తొలి 24 గంటలు గడిచే సమయానికి ఏకంగా 10 మిలియన్స్ కు చేరువైనా ఆశ్చర్యపోనవసరం లేదు. అంతటి క్రేజ్ ను ‘జై’ పాత్ర ద్వారా ‘యంగ్ టైగర్’ సృష్టిస్తున్నాడు మరి..
ADVERTISEMENT
ADVERTISEMENT



