హిలేరియస్ గా కట్ చేసిన ట్రైలర్!

Jamba Lakidi Pamba Trailer talkఈవీవీ సత్యనారాయణ “జంబలకిడి పంబ” టైటిల్ తో కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ప్రధాన పాత్రలో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ నెల 22వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి టీజర్, ట్రైలర్ చాలా విడుదలయ్యాయి. అయితే అవేమీ ఈవీవీ సినిమా స్థాయిలో లేకపోవడంతో, టైటిల్ కు తగ్గ న్యాయం జరగలేదన్న భావన ప్రేక్షకులలో ఏర్పడింది.

ADVERTISEMENT

బహుశా దానిని పోగేట్టేందుకు రిలీజ్ చేసారో ఏమో గానీ, తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ హిలేరియస్ గా ఉంది. పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ తో నాటి ‘జంబలకిడి పంబ’ అనుభూతులను గుర్తుకు తెచ్చింది. ఈ ట్రైలర్ తో టైటిల్ కు పూర్తి న్యాయం జరిగిందన్న అభిప్రాయం ఏర్పడింది. లేడీ బాడీ లాంగ్వేజ్ లో శ్రీనివాస్ రెడ్డి చేష్టలు నవ్వించగా, గోపి సుందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మాంచి ఊపు తెప్పించింది.

జేబీ మురళీకృష్ణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి సరసన సిద్ధి ఇదని హీరోయిన్ గా నటించింది. ఇతర కామెడీ పాత్రల్లో వెన్నెల కిషోర్, పోసాని మురళీ కృష్ణ, సత్యం రాజేష్, ధన్ రాజ్, షకలక శంకర్, హరితేజ తదితరులు నటించారు. ఈ ‘జంబలకిడి పంబ’కు ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారో తెలియాలంటే ఈ నెల 22వ తేదీ వరకు వేచిచూడాల్సిందే.

ADVERTISEMENT
Latest Stories