“జన నాయకుడు” సినిమా రివ్యూ: కేసరిని కిచిడీ చేసి చెడగొట్టారు!

Jana Nayakudu Vijay Telugu Movie Review Rating

చిత్రం: జన నాయకుడు

M9 రేటింగ్: 1.75/5

ADVERTISEMENT

విడుదల తేదీ: జూలై 23, 2026

తారాగణం: విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమిత బైజు, ప్రకాష్ రాజ్, ప్రియమణి తదితరులు

నిర్మాణ సంస్థ: కెవిఎన్ ప్రొడక్షన్స్

దర్శకత్వం: హెచ్.వినోద్

సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్

నిర్మాత: వెంకట్ కే నారాయణ

ఛాయాగ్రహణం: సత్యన్ సూర్యన్

కూర్పు: ప్రదీప్ ఈ.రాఘవ్

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తలపతి ఆఖరి చిత్రంగా రూపొందిన “జన నాయకుడు” ఎలక్షన్స్ ముందు రిలీజ్ అవ్వాల్సినప్పటికీ.. సెన్సార్ ఇష్యూస్ కారణంగా వాయిదాపడుతూ వచ్చి ఎట్టకేలకు నేడు (జూలై 23) విడుదలైంది. హెచ్.వినోద్ తెరకెక్కించిన ఈ చిత్రం నిజంగా విజయ్ కి ఫేర్ వెల్ సినిమాగా నిలవగలిగిందా? “భగవంత్ కేసరి” కథను తమిళ ఆడియన్స్ కి తగ్గట్లు ఎలాంటి మార్పులు చేశారు అనేది చూద్దాం..!!

కథ:

కన్నతల్లిని కడసారి చూసే అవకాశం కల్పించిన జైలర్ కి కృతజ్ఞతగా.. అతడి కుమార్తె విజ్జీ (మమిత బైజు)ను మిలటరీలో చేర్పించి బాధ్యతను తన మీద వేసుకుంటాడు తలపతి వెట్రి కొండన్ (విజయ్).
కట్ చేస్తే.. ఆల్రెడీ కొన్ని దేశాలని, వాటి వ్యవస్థలని నెలకొరిగించి.. నిరంకుశత్వ పరిపాలనను ముందుండి నడిపిస్తుంటాడు జాన్ హిమ్లర్ (బాబీ డియోల్). నెక్స్ట్ టార్గెట్ ఇండియాగా పెట్టుకుంటాడు.
విజ్జిని మిలటరీ ఆఫీసర్ చేయాలన్న వెట్రి ఆశయానికి, ఇండియాలోనూ నిరంకుశత్వ పాలన తీసుకురావాలన్న జాన్ అత్యాశకి మధ్య యుద్ధమే కథాంశం.

నటీనటుల పనితీరు:

సినిమాలో నటించినవాళ్లందరూ దాదాపుగా సీనియర్లే. వాళ్ల పనితనాన్ని ప్రత్యేకంగా మెచ్చుకోవాల్సిన పని లేదు. అయితే.. మమిత నటన చూసాక మాత్రం శ్రీలీల ఎంత బాగా చేసింది కదా అనిపించకమానదు. మొన్న లెనిన్ లో ఆమె లేకపోవడం ప్లస్ అయ్యిందని వాగిన వాళ్ళందరూ ఈ సినిమా చూసాక శ్రీలీల మంచి నటి అని అంగీకరించడం ఖాయం.
విజయ్ చరిష్మా, ఎనర్జీ బాగున్నప్పటికీ.. సన్నివేశాల్లో సరైన స్కోప్ లేకపోవడం వల్ల తమిళ ప్రేక్షకుల సంగతి పక్కన పెడితే, మిగతా భాషల ప్రేక్షకులు మాత్రం విజయ్ స్క్రీన్ ప్రెజన్స్ & యాక్టింగ్ ని కనీస స్థాయిలో కూడా ఎంజాయ్ చేయలేరు.
బాబీ డియోల్ క్యారెక్టర్ భోజ్ పూరీ సినిమాలని గుర్తు చేస్తుంది. ఇక మిగతా విలన్స్ అందరూ టెంప్లేట్ క్యారెక్టర్స్ కి టెంప్లేట్స్ లా మిగిలిపోయారు. పూజా హెగ్డే ఒక పాటకి, కొన్ని సీన్లకి పరిమితం అయిపోయింది.

సాంకేతికవర్గం పనితీరు:

విజయ్ “లియో” చూసినప్పుడు ప్రొడక్షన్ డిజైన్ & గ్రాఫిక్స్ చూసి ఈస్థాయి సినిమాలు తెలుగులో ఎప్పుడు తీస్తారో అనే ప్రశ్న లేవనెత్తితే. “జన నాయకుడు” సినిమాలోని గ్రాఫిక్స్ & ప్రొడక్షన్ వర్క్ ఇంత చీప్ గా తీసేశారేంటి సినిమా అనిపించాయి. సినిమాలో వేసిన సెట్స్ ని ఆడియన్స్ సెట్స్ గా గుర్తించారంటే.. ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్, సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ ఇలా కీ టెక్నీషియన్స్ అందరూ ఫెయిల్ అయినట్లే.
అనిరుధ్ సంగీతం, సత్యం సూర్యన్ సినిమాటోగ్రఫీ, ప్రదీప్ ఎడిటింగ్ వంటి టెక్నికాలిటీస్ అన్నీ చాలా వీక్ గా కనిపించాయి. అందుకు కారణం దర్శకుడు హెచ్.వినోద్ చేసిన మార్పులే. విలన్ క్యారెక్టర్ ను ఓ ఇంటర్నేషనల్ డాన్ లా చూపించే ప్రయత్నమే బెడిసికొట్టింది అనుకుంటే.. సినిమాలో ఇరికించిన పొలిటికల్ ఫ్లేవర్ సినిమాకి మెయిన్ మైనస్ గా మారింది. ఇక రోబోటిక్ వార్ సీక్వెన్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. “ఖాకీ” లాంటి సినిమా తీసిన దర్శకుడేనా ఇది తీసింది? “పింక్” సినిమాని అత్యద్భుతంగా సౌత్ నేటివిటీకి తగ్గట్లుగా ఎలివేషన్స్ యాడ్ చేసి ఆడియన్స్ ను ఎంగేజ్ చేసిన దర్శకుడేనా ఇది తెరకెక్కించింది? అనే అనుమానం కలగక మానదు. చాలా మంచి పొటెన్షియల్ ఉన్న వినోద్ “తునివు, జన నాయగన్” లాంటి సినిమాలతో తన కెరీర్ కి తానే ఎండ్ కార్డ్ వేసుకుంటుండడం గమనార్హం.

విశ్లేషణ:

ఒక రీమేక్ సినిమాని ఎంత బెటర్ గా తీయొచ్చు అనేందుకు హరీష్ శంకర్ “గబ్బర్ సింగ్” బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే.. ఒక రీమేక్ సినిమాని ఎలా తీయకూడదు అనేందుకు “జన నాయకుడు” మరో ఎగ్జాంపుల్ గా నిలుస్తుంది. కచ్చితంగా ఇది విజయ్ కి ఫేర్ వెల్ సినిమా అయితే కాదు. 40 ఏళ్ల విజయ కెరీర్ కి, 40 ఏళ్లుగా విజయ్ ను అభిమానిస్తున్న ఫ్యాన్స్ కి “జన నాయకుడు” తీవ్ర నిరాశ కలిగించే చిత్రం. ఇది విజయ్ ఆఖరి చిత్రం కావడం అనేది బాధాకరం.

ఓవరాల్ గా.. కేసరిని కిచిడీ చేసి చెడగొట్టారు!

M9 రేటింగ్: 1.75/5

ADVERTISEMENT
Latest Stories