‘జనసేన’కు గల్లా స్ట్రాంగ్ రిప్లై!

Galla Jayadev comments on Pawan Kalyanత్వరలో ‘జగన్ పవన్’ అనే సినిమా రానుందంటూ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ వేసిన ట్వీట్, పవన్ అభిమానుల్లో మంట రగిల్చిన విషయం తెలిసిందే. కొందరైతే నిజంగానే ‘జగన్ పవన్’ అనే సినిమా వస్తుందని పవన్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేయగా, అది కేవలం తాను సెటైర్ గా అన్నానని మళ్ళీ గల్లా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. రెండు రోజుల క్రితం వేసిన ఈ ట్వీట్ కు ఇప్పుడు జనసేన నుండి రిప్లై వచ్చింది.

‘గల్లా… ఏమిటీ సిల్లీ కధ…’ అంటూ పార్లమెంట్ లో ఒక రోజు స్పీచ్ ఇచ్చి, ప్రస్తుతం కొత్త సినిమా, కధ, డైరెక్షన్ వంటి బాటరీ డౌన్ మాటలు మాని స్పెషల్ స్టేటస్ తెచ్చే మార్గాలను ఆలోచించండి మాస్టారు… అంటూ జనసేన నుండి పోస్ట్ రాగా, దీనికి కొద్ది నిముషాల్లోనే గల్లా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. నాలుగేళ్ళుగా 100 స్పీచ్ లు… దానినే సెంచరీ అంటారు. మేము కేంద్ర ప్రభుత్వంతో స్పెషల్ స్టేటస్ కోసం పోరాడుతున్నాం.

ADVERTISEMENT

పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పవన్ కళ్యాణ్ ను డిఫెండ్ చేస్తున్నారు? ఎవరితో పవన్ ఫైటింగ్ చేస్తున్నారు. నా బాటరీలు ఫుల్ గా చార్జ్ అయ్యి ఉన్నాయి అంటూ ‘అమ్రాన్’ బాటరీల స్లోగన్ ‘లాస్ట్ లాంగ్… రియల్లీ లాంగ్…’ అంటూ గట్టిగా బదులిచ్చారు. విశేషం ఏమిటంటే… మోడీపై ఒత్తిడి తెస్తున్న ప్రతిసారి, పవన్ ఏదొక రూపంలో ప్రధానిని వెనుకేసుకురావడం! ఇటీవల అయితే మోడీని ఎందుకు తిడుతున్నారంటూ కూడా ట్వీట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచిన వైనం తెలిసిందే.

ADVERTISEMENT
Latest Stories