‘పవన్’ సిద్ధాంతాలకు విరుద్ధంగా ‘జనసేన’ వీడియో!

jana-sena_pawan-kalyan‘అధికారం’ కోసం కాదు… ‘ప్రశ్నించడం’ కోసం… రాజకీయాల్లోకి వచ్చానంటూ ఓ స్పష్టమైన వైఖరితో ముందుకు సాగుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇటీవల ‘జనసేన’ తరపున ఓ అధికారిక యూ ట్యూబ్ ఛానల్ ను ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత తరంలో సోషల్ మీడియాకున్న ప్రాధాన్యతను గుర్తించిన పవన్, ఫేస్ బుక్, ట్విట్టర్, యూ ట్యూబ్ లలో అఫిషియల్ పేజీలను ప్రారంభించారు. అందులో భాగంగా యూ ట్యూబ్ ఛానల్ లో ‘జనసేన’కు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.

ముందుగా తిరుపతి మీటింగ్ కు సంబంధించిన వీడియోను రెండు పార్టులుగా విడుదల చేసారు. ఎలాంటి హంగు, ఆర్భాటం లేకుండా తిరుపతిలో పవన్ ప్రసంగాన్ని మాత్రమే అప్ లోడ్ చేసారు. అయితే తాజాగా కాకినాడ సభకు సంబంధించిన మరో వీడియోను పోస్ట్ చేసి షాక్ ఇచ్చారు. కాకినాడ సభలో పవన్ ప్రసంగాన్ని మాత్రమే అప్ లోడ్ చేస్తారనుకుంటే… రొటీన్ గా అభిమానులు పవన్ ను పొగడ్తలతో ముంచెత్తిన వీడియో బైట్స్ ను కలగలిపి విడుదల చేసారు. అయితే ఇలాంటి భజనలతో కూడిన వీడియోలు పవన్ సిద్ధాంతాలకు విరుద్ధమన్న విషయం పవర్ స్టార్ ను దగ్గర నుండి చూసిన వారు చెప్పే మాట.

ADVERTISEMENT

మరి అలాంటి పవన్, తన ‘జనసేన’ యూ ట్యూబ్ ఛానల్ లో తనను తానూ ‘సెల్ఫ్ ప్రమోషన్’ చేసుకునే విధంగా ఉన్న వీడియోలను విడుదల చేయడం కాకతాళీయమా? లేక తనకు సొంతంగా మీడియా లేదు గనుక, యూ ట్యూబ్ ద్వారా తనను తానూ ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్వయంగా ఈ వీడియోలను పవన్ అప్ లోడ్ చేయకపోయినా… పవన్ కు తెలియకుండా అయితే జరిగి ఉండదన్న విషయం తెలిసిందే. మరి తెలిసి కూడా పవన్ ఎలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సాధారణ రాజకీయ నాయకుల మాదిరే పవన్ కూడా పబ్లిసిటీ కోరుకుంటున్నారా?

‘జనసేన’ సిద్ధాంతాలను, ఆలోచనలను ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తారని సామాన్య ప్రజానీకం భావిస్తే… అందుకు విరుద్ధంగా… ఇలాంటి ‘సెల్ఫ్ ప్రమోషన్’ వీడియోలు ప్రత్యక్షమవడం ఎవరూ ఊహించినది కాదు. రొటీన్ రాజకీయాలతో విసిగి వేసారిన ప్రజలకు సరికొత్త రాజకీయాలను పరిచయం చేయడమే పవన్ ఉద్దేశం. అందుకే తన ప్రణాళికను తదుపరి 20 ఏళ్ళ కోసమంటూ ప్రకటించారు. ఏ ఒక్క రోజులోనో, ఒక్క ఏడాదిలోనో, ఒక్క ఎన్నికల సమయంలోనో ఈ మార్పు సాధ్యమయ్యే విషయం కాదన్న విషయం పవన్ కు తెలుసు. మరి అలాంటి ఆదర్శవంతమైన పవన్ సిద్ధాంతాలకే విరుద్ధంగా తనను తానూ పబ్లిసిటీ చేసుకునే విధంగా ‘జనసేన’ను వినియోగించుకోవడం ఎంతవరకు సమంజసమో పవన్ కళ్యాణే నిర్ణయించుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories