జగన్ పేరెత్తలేదు… అయినా జగన్ పై కౌంటర్ వేసిన పవన్..!

Jana-Sena-Pawan-Kalyan-comments-on-YS-jaganటార్గెట్ బిజెపి – టిడిపి ప్రభుత్వాలుగా సాగిన ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగం సూటిగా సుత్తి లేకుండా సాగింది. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు నుండి టిడిపి నేతలు రాయపాటి, సుజనా చౌదరిల వరకు కౌంటర్లు వేసిన పవన్ కళ్యాణ్, రాష్ట్రంలోని ప్రతిపక్ష నేత జగన్ పేరును మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. అధికారంలోకి రావడానికి చెప్పిన మాటలను, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు విస్మరిస్తున్నారు? అనేది పవన్ ప్రసంగంలోని ‘థీమ్.’

అయితే పవన్ చెప్పడం అయిపోయిన తర్వాత మీడియా వర్గీయులు పలు ప్రశ్నలను సంధించారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు జగన్, పవన్ లు ప్రయత్నిస్తున్నారని మీడియా ప్రతినిధులు పవన్ ప్రశ్నించగా… నేనెందుకు అడ్డుకుంటాను, అడ్డుకునేవాడినే అయితే నేను విశాఖ వెళ్ళాలి కదా… అలా నేను వెళ్ళలేదు కదా… అని బదులిచ్చారు. ఈ జవాబు వెనుక ఆంతర్యం తెలియనిది కాదు. ‘అభివృద్ధిని అడ్డుకునే ఉద్దేశం ఉంటే, ఖచ్చితంగా విశాఖ వెళ్ళాలి అన్న అభిప్రాయం’ నేరుగా జగన్ వర్గీయులను తాకుతుందని చెప్పడంలో సందేహంలేదు.

ADVERTISEMENT

అలా తనకు తెలియకుండానే జగన్ తీరును ఎండకట్టారు జనసేన అధినేత. జగన్ పోకడ, విధివిధానాలు సరిగా లేకపోవడం వలనే, రాష్ట్రంలో మరో ప్రత్యామ్నాయం లేక, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రత్యక్ష విమర్శలకు దిగడం లేదని, ఒక విధంగా సిఎంపై పవన్ ‘సాఫ్ట్ కార్నర్’ వ్యవహరిస్తున్నారన్న భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రత్యక్ష రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ క్రియాశీలక పాత్ర పోషించబోతున్నారన్న విషయమైతే స్పష్టమైంది.

ADVERTISEMENT
Latest Stories