పవన్… ఈ కుళ్ళు రాజకీయాలేంటి..?

Jana-Sena-Politics---Pawan-Kalyanరాష్ట్ర విభజన కారణంగా ఆదాయం లేక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆశించిన వేగంలో జరగడం లేదన్నది జగమెరిగిన సత్యం. తెలంగాణా రాష్ట్రం తర్వాత ఏపీ పరిస్థితి ఇలా ఉంటే, ప్రస్తుతమున్న ఏపీలో మరో ఉద్యమం రేపేందుకు ‘జనసేన’ అధినేత కంకణం కట్టుకున్నారా? అంటే సంకేతాలు అయితే అలాగే కనపడుతున్నాయి. ప్రజలలో ఎలాంటి అభిప్రాయము లేని వేళ… ‘ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం’ అంటూ పవన్ పదే పదే ప్రస్తావించడం అనేది, బహుశా తూగో, పగో జిల్లాలలోని ఓట్లన్నీ జనసేనకు పడేలా చేయడానికి అని చెప్పవచ్చు.

రాయలసీమలో వైసీపీ, టిడిపిలు స్ట్రాంగ్ గా ఉన్నాయి గనుక, అక్కడ ఎన్ని విన్యాసాలు చేసినా, ఇంకెన్ని సినిమాటిక్ డైలాగ్ లు వేసినా పవన్ కు ఓట్లు రాలవన్న సంగతిని గ్రహించినట్లున్నారు. కోస్తా జిల్లాలో అభిమానంతో పడే ఓట్లు ఉంటాయి గనుక చెదురుమదురుగా కొన్ని సీట్లు కొట్టినా, తన సామాజిక వర్గం ఎక్కువ జాబితా కలిగిన కీలకమైన ఉత్తరాంధ్రలో వీలైనన్ని ఎక్కువ సీట్లను కొల్లగొట్టడం ద్వారా జనసేనను నిలబెట్టుకునే ప్రయత్నంలో పవన్ ఉన్నట్లుగా ఆయన చేస్తోన్న ప్రకటనలే చెప్తున్నాయి.

ADVERTISEMENT

ప్రజలలో లేనటువంటి విద్వేష భావాలను రెచ్చగొట్టి తద్వారా తన రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకోవడం పవన్ చేస్తోన్న కుళ్ళు రాజకీయాలకు నిదర్శనంగా పేర్కొనవచ్చు. ఇప్పటికే జగన్ రూపంలో కీలకమైన అంశాలలో అభివృద్ధి కుంటుపడుతుండగా, ఇపుడు జగన్ కు తోడుగా పవన్ కూడా అదే బాటలో పయనిస్తూ అభివృద్ధికి తాను కూడా ఒక ఆటంకంగా మారుతున్నారు. వెనుకబాటుతనం అనేది ఒక్క ఉత్తరాంధ్రకే పరిమితం కాలేదన్న విషయం పవన్ ఎప్పుడు గుర్తిస్తారో గానీ, ఈయన గారి అవగాహనారాహిత్యపు మాటలను నమ్మితే అంతే!

సిద్ధాంతపరంగానే తన ప్రవర్తన ఉంటుంది, ఆదర్శప్రాయమైన సిద్ధాంతాలతోనే రాజకీయ మార్పు సాధ్యం అన్న పవన్ లో రానూ రానూ మరీ దిగజారుడు రాజకీయం కనపడుతుందే తప్ప, పరిపక్వత కలిగిన రాజకీయ నాయకత్వ లక్షణాలు మచ్చుకైనా కానరావడం లేదు. బిజెపి చేతిలో కీలుబొమ్మలా ఆడుతున్నారన్న విమర్శలకు ఈ ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం వ్యాఖ్యలు మరింత బలాన్నిస్తున్నాయి. గతంలో బిజెపి నేత సోము వీర్రాజు కూడా ఇలాగే ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసారు, అయితే పవన్ రంగంలోకి దిగిన తర్వాత సోము సైలెంట్ అయ్యారు.

ADVERTISEMENT
Latest Stories