జనసేన… ఊపు లేనే లేదు..!

JanaSena Jenda Song public talk“తూర్పు దిక్కు ఎరుపెక్కి… మార్పు కొరకు ప్రశ్నించే హక్కేరా… ఈ జనసేన…” అంటూ పార్టీ ఆవిర్భావ సభలో ఆవిష్కరించిన ‘జనసేన’ థీమ్ సాంగ్ ఒక్క పవన్ అభిమానుల్లోనే కాదు, సాధారణ ప్రజల్లో కూడా మంచి ఆదరణ పొందింది. అంతేకాకుండా పార్టీ బహిరంగ సభలలో కూడా అభిమానులకు, కార్యకర్తలకు ఈ పాట మంచి ఉత్సాహాన్ని పంచడంలో విజయవంతం అయ్యింది. ఈ పాట తర్వాత ‘జనసేన’కు చాలా పాటలు విడుదలయ్యాయి గానీ, ఒక్క పాట కూడాఆదరణకు నోచుకోలేదు.

ఈ క్రమంలోనే ‘జనసేన’ జెండా పాట అంటూ తాజాగా మరో పాటను విడుదల చేసారు. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ పాటకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. సంగీత, సాహిత్య పరంగా… రెండు రకాలుగా ఏ మాత్రం ఆకట్టుకోలేని పాటగా నిలవడం విశేషం. ముఖ్యంగా జనసైనికులకు కావాల్సిన ఊపును ఈ పాట ఏ మాత్రం పంచలేకపోయింది. దీంతో మరోసారి నిరుత్సాహపడడం పవర్ స్టార్ అభిమానుల వంతవుతోంది. సినీ రంగం నుండి వచ్చారు గనుక, ‘జనసేన’ పాటలు ప్రజల ఆలోచనలకు, పార్టీ ఆశయాలను ప్రతిబింబించే విధంగా ఉంటాయని భావిస్తే, అందుకు విరుద్ధంగా పేలవంగా ఉండడం ఊహించినది కాదు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories