గతంతో పోలిస్తే రాజకీయాలు, రాజకీయ విలువలు పూర్తిగా పతనమయిపోతున్నాయా అన్న సందేహాలు కలుగుతున్నాయి. రాజకీయాలలోకి వాటికీ సంబంధం లేని కుటుంబ సభ్యులను లాగుతున్నారు, మహిళలను కించపరుస్తున్నారు, ఇక ఇంకాస్త కిందకి దిగజారి బూతులు సైతం రాజకీయ వాడుకభాషగా మార్చేస్తున్నారు.
ఇక మరికొందరు అన్ని హద్దులను దాటేస్తూ రాజకీయ నాయకులుగా సమాజానికి ఆదర్శంగా, పార్టీకి గౌరవంగా ఉండాల్సిన పరిస్థితులలో మహిళలతో అక్రమ సంబంధాలను పెట్టుకుని, వారితో అసభ్యకర రీతిలో ప్రవర్తిస్తూ పార్టీకి భారంగా, సమాజానికి చేటుగా మారుతున్నారు.
నాడు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతలు, మాజీ మంత్రులు గంట అరగంట అంటూ అడ్డంగా దొరికేసారు. ఇక వైసీపీ ఎంపీ, మాజీ పోలీస్ అధికారి అయిన గోరంట్ల మాధవ్ ఏకంగా తన విశ్వరూపాన్ని సోషల్ మీడియా వేదికగా యావత్ దేశానికి చూపించేసారు.
అయితే నాడు ఆయన వీడియో ఒక్క వైసీపీ పార్టీ పరువునే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను కూడా బజారుకు లాగింది. ఇప్పుడు అటువంటిదే జనసేన ఎమ్మెల్యే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక ప్రభుత్వ మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధిస్తున్నాడంటూ వైసీపీ శ్రీధర్ కి సంబంధించిన సోషల్ మీడియా చాట్ తో పాటుగా ఆయన న్యూడ్ వీడియో ని పోస్ట్ చేసింది.
అలాగే సదరు బాధిత మహిళ సైతం బయటకొచ్చి తన ఆవేదన తెలియచేసారు. అరవ శ్రీధర్ తో పాటుగా వీడియో లో ఉన్న మహిళలను తానేనంటూ మొదలుపెట్టిన బాధితురాలు తనను ఎమ్మెల్యే న్యూడ్ వీడియో కాల్స్ చెయ్యాలంటూ బలవంత పెట్టారని, తన కోరిక తీర్చాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పుకొచ్చారు.
అయితే గతంలో ఇలానే వీడియోలతో అడ్డంగా దొరికిన వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల తన పై ప్రత్యర్థి పార్టీ కుట్రలు చేస్తుందని, రాజకీయంగా అణిచివేసేందుకు తన పై ఇటువంటి ఫేక్ వీడియోలు రిలీజ్ చేస్తున్నారంటూ తన తప్పుని వైసీపీ రాజకీయం తో కవర్ చేసుకున్నారు.
అలాగే నాడు వైసీపీ కూడా సదరు నేత మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా గోరంట్లకు మద్దతుగా నిలిచింది. కానీ నేడు కూటమి పార్టీలో ఆయా పార్టీల నేతల మీద ఇటువంటి మహిళా సెంట్రిక్ ఆరోపణలు వచ్చినా ఆ నేతల పై అటు టీడీపీ కానీ ఇటు జనసేన కానీ తక్షణమే చర్యలకు పాల్పడుతుంది.
ఇందుకు ఇప్పటికే టీడీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే ఒకరు జనసేన కు దూరంగా ఉండాలంటూ పవన్ నుంచి ఆదేశాలు అందుకున్న నాయకులు కొందరు ప్రత్యక్ష ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఇప్పుడు అరవ శ్రీధర్ కూడా అదే కోవలోకి వస్తారా.? పవన్ శ్రీధర్ పై ఎటువంటి చర్యలకు ఆదేశాలు ఇస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.