పవన్ కళ్యాణ్ కొత్త గడ్డం… ఫ్యాన్స్ కు రిలీఫ్

Pawan Kalyan New Lookసినిమాలను విడిచి రాజకీయాలలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గుబురు గడ్డం, పొడుగు జుట్టుతో ఒక మహర్షిలా కనిపించేవారు. సినిమా హీరోలా స్టైలిష్ గా ఉంటే ప్రజలు తనని సీరియస్ గా తీసుకోరు అనుకున్నారేమో గుబురు గడ్డం, పొడుగు జుట్టుని మాత్రం తీసేవారు కాదు. ఎన్నికల ఫలితాలు వచ్చినా చాలా రోజులు అదే లుక్ మైంటైన్ చేశారు జనసేనాని. అయితే ఇప్పుడు కొంత స్టైల్ మార్చారు. ఆ కొత్త లుక్ కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

గడ్డం పూర్తిగా తీయ్యకపోయినా బాగా పల్చగా ట్రిమ్ చేయించారు. జుట్టు కూడా బాగా తగ్గించి సరికొత్త లుక్ లో కనిపించారు. ఆ ఫొటోలో ఉన్నది పవన్ కళ్యాణ్ పర్సనల్ హెయిర్ స్టయిలిస్ట్ రామ్. ఆ పక్కనే ఉన్న అమ్మాయి ఎవరో తెలియరాలేదు. మొత్తానికి ఫ్యాన్స్ ఈ కొత్త లుక్ తో రిలీఫ్ చెందారు. కొందరైతే కొత్త లుక్ తో ఒక సినిమా చేసేయ్ అన్నా అంటూ ఆయనకు ట్వీట్ చేస్తున్నారు. తొందరలో తానా సభలకు హాజరు కావడానికి అమెరికా వెళ్ళబోతున్నారు పవన్ కళ్యాణ్.

ADVERTISEMENT

ఇది ఇలా ఉండగా తాను ఎదురుకున్న మొదటి ఎన్నికలలో జనసేనకు కేవలం ఒక్కే ఒక్క సీటుతో తన ఖాతాను తెరిచింది. తన తొలి ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు నిరాశాజనకమైన ఫలితాలు వచ్చాయి. ఆ పార్టీ పేలవమైన ప్రదర్శన తో పాటు పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసినా రెండు సీట్లలో లోను ఓడిపోయారు. కేవలం 5% పై చిలుకు ఓటు షేర్ తో అప్పటి ప్రజారాజ్యం పార్టీ కంటే పేలవమైన ప్రదర్శన కనబరిచింది. దీనితో పార్టీ మనుగడ మీదే అనుమానాలు మొదలయ్యాయి.

ADVERTISEMENT
Latest Stories