‘బుడ్డోడు’ భలే ‘ట్విస్ట్’ ఇచ్చాడుగా..!

Mohanlal Janatha Garage TrailerTalk, Janatha Garage Malayalam TrailerTalk, Mohanlal Janatha Garage Malayalam TrailerTalk;యంగ్ టైగర్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన “జనతా గ్యారేజ్” టీజర్ వచ్చేసింది. ప్రస్తుతం దీనిని పదే పదే చూసుకుంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అలాగే ఈ టీజర్ తో గత యూ ట్యూబ్ రికార్డులను సరిచేసే పనిలో కూడా ఉన్నట్లు కనపడుతోంది. అంతలా ఉత్సాహం నింపిన “జనతా గ్యారేజ్”కు సంబంధించి మరో టీజర్ విడుదల కావడం అభిమానులను అవాక్కు చేసింది.

‘జనతా గ్యారేజ్’లో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. మలయాళంలో సూపర్ స్టార్ డం ఇమేజ్ ఉన్న మోహన్ లాల్ తో ఓ టీజర్ ను రూపొందించి మలయాళ భాషలో విడుదల చేయడం ఊహించని పరిణామం కావడంతో, బుడ్డోడు అభిమానుల ఉత్సాహం మరింత రెట్టింపయ్యింది. జూనియర్ ఎన్టీఆర్ ను అదే లుక్స్ లో చూపించినప్పటికీ, ‘జనతా గ్యారేజ్’లో అన్ని రిపేర్లు చేయబడును అని మోహన్ లాల్ చేత చెప్పించి ఈ టీజర్ ను విడుదల చేసారు.

ADVERTISEMENT

చూడబోతుంటే… ‘బాహుబలి’ సినిమా మాదిరి ఇతర భాషలపై కూడా ‘జనతా గ్యారేజ్’ కన్ను పడినట్లు అర్ధమవుతోంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా తెలుగు, మలయాళ భాషల్లో ‘జనతా గ్యారేజ్’ సిద్ధమవుతోందని స్పష్టం. మరి మిగిలి ఉన్న తమిళ భాషలో కూడా ఈ గ్యారేజ్ ను దింపుతారో లేదో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories