“జనతా గ్యారేజ్” టీజర్ – రాసుకో రాజా!

Janatha Garage Teaser Twitter Talk, Janatha Garage Teaser Social Media Talk, JR NTR Janatha Garage Teaser Twitter Talk, Janatha Garage Teaser Talk‘అన్నం ఉడికిందో లేదో ఒక పొలుకు చూసి చెప్పవచ్చు’ అంటారు పెద్దలు. ప్రస్తుతం సినిమాల విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తోంది. సినిమా తొలి టీజర్ చూసే ఆ సినిమా ఉంటుందో ఉడుతుందో అంచనాలు వేసేస్తున్నారు సినీ విశ్లేషకులు మరియు సాధారణ ప్రేక్షకులు. మరి జూనియర్ ఎన్టీఆర్ “జనతా గ్యారేజ్” టీజర్ గురించి ఏమనుకుంటున్నారు? అంటే… ఇంకా చెప్పాలా… రాసుకోండి రాజా… జనతా గ్యారేజ్ మరో బ్లాక్ బస్టర్ అంటున్నారు యంగ్ టైగర్ అభిమానులు.

అవును… జూనియర్ అభిమానులకు అంత నమ్మకం ఇచ్చింది ఈ 34 సెకన్ల చిన్న టీజర్. జూనియర్ ఎన్టీఆర్ లుక్, డైలాగ్స్, ముఖ్యంగా ఆ బైక్ తిప్పుతున్న షాట్… ఈ టీజర్ ను పదే పదే చూసేలా చేస్తాయి. ఇక, బ్యాక్ గ్రౌండ్ అందించిన దేవిశ్రీప్రసాద్ గురించి ఎంత చెప్పినా తక్కువే. హీరోయిజం ఎలివేట్ అయ్యే విధంగా, చూసే ప్రేక్షకులకు ఊపొచ్చే విధంగా ఈ టీజర్ ప్రధాన మార్కులు కొట్టేసాడు దేవిశ్రీ.

ADVERTISEMENT

ఇక, కొరటాల షాట్స్, తిరునవుక్కరసు ఫోటోగ్రఫీ, ఎన్టీఆర్ యాక్షన్ సన్నివేశం… చిన్న టీజర్ అయినా ప్రతి షాట్ అద్భుతంగా ఉంది. అదీ గాక, ఈ సినిమా థీమ్ కూడా ఎన్టీఆర్ డైలాగ్స్ ద్వారా కొరటాల స్పష్టంగా చెప్పేసాడు. దీంతో యంగ్ టైగర్ అభిమానులకు బలం వచ్చింది. ప్రస్తుతం గత రికార్డులన్నింటినీ బలహీనపరిచే దిశగా సందడి చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories