పాక్‌తో మరో యుద్ధం తప్పదా?

J&K Kulgam CRPF Camp Attack: Three Jawans Reportedly Injured

జమ్మూ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు జవాన్లు గాయపడినట్లు తెలుస్తోంది. వెంటనే జవాన్లు కూడా ఎదురు కాల్పులు జరపడంతో ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోయారు. సీఆర్‌పీఎఫ్ బృందాలు వెంటనే వారి కోసం గాలింపు మొదలుపెట్టాయి.

ఒకప్పుడు, అంటే కాంగ్రెస్‌ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారం ఉన్నప్పుడు కశ్మీర్‌లో, దేశవ్యాప్తంగా పాక్‌ ఉగ్రదాడులు జరగడం, వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోవడం పరిపాటిగా ఉండేది. అలాంటి సందర్భాలలో కాంగ్రెస్‌ ప్రధాని, కేంద్రమంత్రుల దిగ్బ్రాంతి ప్రకటనలు, ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామనే ప్రకటనలు కూడా పరిపాటిగా వినిపించేవి. దాడి జరిగిన ప్రతీసారి కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరు ఇలాగే ఉండేది.

ADVERTISEMENT

కానీ మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టాక భారత్‌పై దాడి చేస్తే ప్రతి దాడి చేస్తూ, మళ్ళీ అలాంటి ఆలోచన చేసేందుకు భయపడేలా చేశారు

చివరిసారిగా గత ఏడాది మే 7వ తేదీన ‘ఆపరేషన్ సిందూర్’ మొదలుపెట్టి వరుసగా మూడు రోజుల పాటు పాకిస్తాన్‌లోని కీలక స్థావరాలపై భారత్‌ విరుచుకు పడింది. మే 9వ తేదీన భారత్‌ బ్రహ్మోస్ క్షిపణితో పాక్‌ వాయుసేన స్థావరాలను ధ్వంసం చేయడంతో, పాక్‌ పాలకులు అమెరిక అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను బ్రతిమాలుకొని భారత్‌పై ఒత్తిడి తేవడంతో మే 10వ తేదీన యుద్ధం నిలిపి వేసింది.

కానీ పాక్‌ దుశ్చర్యలకు గుణపాఠం నేర్పేందుకు భారత్‌ నుంచి పాక్‌లోకి ప్రవహిస్తున్న సింధూ నదీ జలాలకు అడ్డుకట్ట వేసి, భారత్‌ భూభాగాలకు మళ్ళించింది. అలా చేయడం యుద్ధ చర్యగానే పరిగణిస్తామని పాక్‌ పాలకులు ప్రగల్భాలు పలికారు. కానీ ఏమీ చేయలేకపోయారు.

ఈ నేపధ్యంలో పాక్‌ ఉగ్రవాదులు మళ్ళీ భారత్‌ సైనిక శిబిరంపై దాడి చేసినందున మరోసారి పాక్‌పై భారత్‌ విరుచుకు పడే అవకాశం ఉండవచ్చు. కనుక పాక్‌ ప్రభుత్వం, సైన్యం ఇందుకు సిద్ధంగా ఉండక తప్పదు.

ADVERTISEMENT
Latest Stories