తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతున్నానని చెప్తే ఎవరూ నమ్మరు. అలాగే విజయసాయిరెడ్డి నేను ఎవరు విడిచిన బాణాన్ని కాదు.. నా వెనుక ఎవరూ లేరంటూ అయన దేవుడిపై ఒట్టేసి చెప్పినా ఎవరూ నమ్మే పరిస్థితి ఉండదని సోషల్ మీడియాలో ఆయన కొత్త పార్టీపై వస్తున్న కామెంట్స్ చూస్తే అర్ధమవుతుంది. వారి భిన్న వాదనలు అందరినీ ఆలోచింపజేస్తాయి.
· పరివర్తన్ రాజనీతి పార్టీ.. లాంచింగ్ ముహూర్తం.. పేరులో కూడా ‘11’. ఇది ఎవరిని టార్గెట్ చేసేందుకో తెలుస్తూనే ఉంది.
· రాయలసీమ రెడ్లను చీల్చి జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టేందుకే చంద్రబాబు నాయుడు ఆయన చేత పార్టీ పెట్టించారు.
· హిందూ ఓట్లను చీల్చి టీడీపి, జనసేనలను దెబ్బ కొట్టి వైసీపీకి సాయపడేందుకే అయన చేత జగన్ పార్టీ పెట్టించారు.
· టీడీపి, వైసీపీలకు ప్రత్యామ్నాయంగా జనసేన ఎదగకుండా అడ్డుకునేందుకు జగన్ పెట్టించారు. పైకి జగన్‌ని తిట్టినా ఎన్నికల తర్వాత ఇద్దరూ కలిసిపోతారు.
· మనోభావాలు దెబ్బ తింటే చాలు పార్టీలు పెట్టేస్తున్నారు..
· అక్కడ కవిత, ఇక్కడ విజయసాయి ఇద్దరికీ డబ్బుకు కొదవ లేదు. అందుకే ఈ హడావుడి. అది కాస్తా ఊడ్చిపెట్టుకుపోతే మళ్ళీ సొంత గూటికే!
· టీఆర్ఎస్ పార్టీ పేరుతో కవిత పార్టీ.. ప్రజారాజ్యం పార్టీని డూప్లికేట్ పీఆర్‌పీతో విజయసాయి.. ఎవరిని మభ్య పెట్టగలరు? ఎవరి ఓట్ల కోసం?
· నీలో పరివర్తన వచ్చిందా? రానప్పుడు ఆయనలో పరివర్తన ఎలా సాధ్యం?
· పరివర్తన విలీనం ఏ పార్టీలో?
· ఇలాంటి పార్టీలు వస్తాయి పోతాయి. కానీ రాజకీయాలు మాత్రం మారవు. అవెప్పుడు అలాగే సాగుతాయి.
· పార్టీకి ‘గుడ్ విల్’ వచ్చాక అమ్మేయడం ఖాయం. ఇదీ మంచి బిజినెస్సే!
· మోడీ సూచనతోనే ఈ పరివర్తన్.. పార్టీ జెండాయే సాక్షి!
· యోగీ ఆదిత్యనాథ్ ఆఫ్ ఆంధ్రా!
· పార్టీలో చేరేందుకు నేను రెడీ.. టికెట్ ఇస్తారా?
· పీఆర్‌పీ అంటే ప్రజారాజ్యం 2.0? ముగింపు కూడా అలాగేనా?
· ఒకప్పుడు మనం చేసిన పనులకి ఇప్పుడు పెట్టిన పార్టీ పేరుకి ఏమైనా సంబంధం ఉందా?







