రాంచరణ్ 16 పేరుతో బుచ్చిబాబు – చిట్టిబాబు మూవీ లాంఛనంగా ప్రారంభమైంది. అయితే ఈ పూజా కార్యక్రమానికి మూవీ దర్శకుడు బుచ్చిబాబు, ఆయన గురువు గారు సుకుమార్, శంకర్, మెగాస్టార్ చిరంజీవి, మ్యూజికల్ సెన్సేషన్ ఏఆర్ రెహమాన్ తో పాటుగా ఆ మూవీ హీరో రాంచరణ్, హీరోహిన్ జాహ్నవి కపూర్ కూడా హాజరయ్యారు.
తెలుగు ప్రేక్షకులను తన అందం అభినయంతో కట్టిపడేసారు జాహ్నవి తల్లి శ్రీదేవి. అయితే ఇప్పుడిప్పుడే టాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్న జాహ్నవి ఇంకా తన అభినయాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయలేదు కానీ తన అందంతో మాత్రం టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోగలుగుతున్నారు.
జూ. ఎన్టీఆర్ తో నటిస్తున్న దేవర మూవీలో కూడా లంగా ఓనితో కనిపిస్తూ తెలుగు తనాన్ని పలికిస్తున్న జాహ్నవి రాంచరణ్ 16 పూజా కార్యక్రమానికి కూడా చీరలో మెరిశారు. దీనితో ఒక్కసారిగా తల్లి శ్రీదేవిని గుర్తుచేశారు అంటూ శ్రీదేవి అభిమానులు జాహ్నవి పై పొగడ్తలు కురిపిస్తున్నారు. అలాగే జాహ్నవి మోడ్రన్ డ్రెస్సులో కన్నా చీరకట్టులో మరింత అందంగా మెరిసిపోతున్నాడు అంటూ ఆమె ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు.
అలాగే శ్రీవల్లి తో నేషనల్ క్రష్ గా సినీ ఇండస్ట్రీని పులుపెక్కించిన రష్మిక ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎర్ర చీరలో, వంటి నిండా బంగారంతో పుష్ప 2 షూటింగ్ స్పాట్ నుంచి రష్మిక ఫోటో ఒకటి సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. ఎర్రచీరలో శ్రీవల్లి అదిరింది అంటూ ఆ ఫోటోను వైరల్ చేస్తున్నారు ఆమె ఫాన్స్. పుష్ప మూవీ లో డీగ్లామర్ పాత్ర పోషించినప్పటికీ నేషనల్ క్రష్ గా మారిపోయారు రష్మిక.
ఇప్పుడు యానిమల్ మూవీ తో మరో సారి బ్లాక్ బాస్టర్ పాన్ ఇండియా హిట్ అందుకున్న ఈ అమ్మడు అంతకు మించి అనేలా తన ఫాలోవింగ్ ను పెంచుకుంది. పుష్ప 1 లో డీగ్లామర్ పాత్ర పోషించిన రష్మిక ఇప్పుడు పుష్ప 2 లో గ్లామర్ గా కనపడడంతో పుష్ప 2 లో శ్రీవల్లి పాత్ర పై కూడా అంచనాలు పెరిగిపోయాయి. అందంతో పాటు అభినయంలోనూ మెప్పించారు రష్మిక. ఇలా అటు జాహ్నవి…ఇటు రష్మిక లీకైన చీరకట్టు ఫోటోలు చూస్తున్న అభిమానులకు మాత్రం నైయనానందాన్ని కలిగిస్తున్నాయని చెప్పాలి.




