జేడీ చక్రవర్తి వివాహం అంట… వధువు ఎవరో తెలుసా..!

JD Chakravarthy, JD Chakravarthy Wedding, JD Chakravarthy Wedding Rumour, JD Chakravarthy Sridevi Wedding Rumour, JD Chakravarthy Wedding Gossip, JD Chakravarthy Wedding Confirmed, JD Chakravarthy Anukruthi Wedding Rumour, JD Chakravarthy Anukruthi Wedding,  Actor JD Chakravarthy Weddingగురువు రాంగోపాల్ వర్మ మాదిరే శిష్యుడు జేడీ చక్రవర్తి పేరు కూడా ఎప్పుడూ వివాదాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. హీరోయిన్ శ్రీదేవిని అమితంగా ఇష్టపడిన వారిన జాబితాలో జేడీ కూడా ఒకరు. అలాగే ఆ తర్వాతి కాలంలో మహేశ్వరి వ్యవహారంలో కూడా జేడీ పేరు ప్రధానంగా హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అవన్నీ విఫలమైన తర్వాత వివాహం ఊసెత్తని జేడీకి ప్రస్తుతం 46 సంవత్సరాల వయసు.

ADVERTISEMENT

పెళ్లి చేసుకోవాలని తన తల్లి బలవంతం చేస్తోందని ఇటీవల జేడీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా జేడీకి వధువు నిశ్చయమైందని, ఆమె ఎవరో కాదు, వర్మ స్కూల్ నుండి వచ్చిన మరో హీరోయిన్ అని ప్రచారం జరుగుతోంది. వర్మ తెరకెక్కించాల్సిన సినిమా “శ్రీదేవి”లో హీరోయిన్ గా ఎంపికైన అనుకృతిని జేడీ వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నట్లుగా సమాచారం.

“పాప” సినిమా షూటింగ్ సందర్భంలో చిత్ర దర్శకుడిపై అభియోగాలు వ్యక్తపరిచి టాలీవుడ్ లో సంచలనం రేపిన అనుకృతి పేరు ఇటీవల కాలంలో మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ గా వినపడింది. మరి ఈ పెళ్లి వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు గానీ, త్వరలోనే ఓ ప్రకటన విడుదల చేయనున్నారని టాక్.

ADVERTISEMENT
Latest Stories