‘జనతా గ్యారేజ్’ క్లైమాక్స్ సెట్స్!

Janatha Garage, Janatha Garage Stills, Janatha Garage Set Photo, NTR Janatha Garage Set stills, Jr NTR Janatha Garage Set photos , Janatha Garage Set working stillsమరికొద్ది గంటల్లో విడుదల కాబోతున్న “జనతా గ్యారేజ్” టీజర్ కోసం యంగ్ టైగర్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే అప్పటివరకు అభిమానులను ఉత్సాహంలో ఉంచేందుకు ‘జనతా గ్యారేజ్’ సెట్స్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరణ జరిపే సెట్ గా భావిస్తున్నటువంటి షెడ్ ఫోటోలను ఫ్యాన్స్ షేర్ చేస్తూ హల్చల్ చేస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ విజయంతో పాటు, మంచి పేరును తీసుకురావడం… అలాగే ‘మిర్చి, శ్రీమంతుడు’ సినిమాల తర్వాత కొరటాల హ్యాట్రిక్ మూవీగా ప్రాధాన్యతను సంతరించుకోవడం… ఈ ‘జనతా గ్యారేజ్’పై అంచనాలు పెంచేలా చేసాయి. అయితే కొరటాల శివ గత రెండు సినిమాలు కూడా ‘లో ప్రొఫైల్’లో విడుదలై భారీ హిట్లను తమ ఖాతాలో వేసుకున్నాయి. కానీ, ‘జనతా గ్యారేజ్’ మాత్రం భారీ అంచనాలతో సిద్ధమవుతోంది. మరి ఆ అంచనాలను నేడు విడుదల కానున్న టీజర్ ఏ మాత్రం అందుకుంటుందో చూడాలి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories